ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

79

"ఇంగ్లండులోఁగూడఁ గొందఱు మనపట్ల శత్రువైఖరి నవలంబించి, యీ వివాదములను గుఱించి మిత్రరాజ్యసమితికి ఫిర్యాదు చేయవలయునని రహస్యముగా మంత్రాంగముచేసిరి. గోవా నమ్ము విషయమై రాయబారములుకూడ జరిగినవి. హైదరాబాద్‌కు దొంగతనముగా నాయుధముల సరఫరా జరిగినది.

నిస్సహాయుఁడు నిజాము

"దీని కంతకు నెవరు బాధ్యులను విషయము నిప్పుడప్పుడే తేల్చి చెప్పలేము. ఇతరుల చేతులలోఁ దాను బందీనయిపోతినని నవాబ్ చెప్పుచున్నాఁడు. మిత్రరాజ్యసమితిలో నీ వినాదను గొనసాగించుట తన కిష్టము లేదనియు ఫిర్యాదు నుపసంహరించుకొనుచు మిత్రరాజ్యసమితికిఁ దా నొక లేఖ వ్రాసితినని నేఁ డాయన చెప్పుచున్నాడు. నవాబ్ పేరిట స్టర్లింగ్ నిల్వలన్నిటిని నాయన ప్రతినిధులు పాకిస్థాన్‌కు బదిలీ చేసినారు. తమ కుటుంబములను వారు పాకిస్థాన్‌కు దరలించివేసినారు. ఇన్ని జరిగినతర్వాతగూడ సుహృద్భావమని, యిరుగుపొరుగువారమని ప్రేమాభిమానములని, పాకిస్థాన్ ధర్మపన్నాలు చెప్పు చున్నది. అదంతయు నర్థములేని ప్రసంగము.

"ఇండియా దుర్బుద్ధితో జేసిన యొక్క దుష్కృత్యము నైన వ్రేలుమడచి చూపించవలసినదని పాకిస్థా^కు సవాలు చేయుచున్నాను. వారట్లు చూపించిన దానికిఁ దగుసమాధానము మన మీయవచ్చును. కాని యాంతరంగిక వ్యవహారములలో దాని జోక్యమును మన మిక సహించఁజాలము. ఈ