ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

వల్లభాయిపటేల్

వజ్రసంకల్పము

"స్వాతంత్ర్యసిద్ధి పిమ్మట సార్వభౌమాధికార మంతరించిపోవునని కొత్తడోమినియనులలోఁ జేరుటకుగాని లేక స్వతంత్రముగా విడిపోవుటకు గాని సంస్థానములకు స్వేచ్ఛయుండునని, దేశవిభజన ప్రణాళికలో నొక షరతున్నది. కాని చిన్న చిన్న సంస్థానాధిపతు లందరికి నున్నట్టుండి యొక్క పెట్టున సార్వభౌమాధికారము సంక్రమించునని తలపోసిన యమాయకుఁ డెవఁడు నుండఁడు. నిజముగా నట్టిపరిస్థితి యత్యంతప్రమాదభరితమైనది. దానికి మనమెన్నడు నంగీకరించువారముకాదు. ఈ తరుణములోనే పెక్కుమంది సంస్థానాధిపతులు దేశభక్తి ప్రేరితులై మనతోఁ గలసిపోవుటకు నిశ్చయించుకొన్నారు.

"విడిగా నుండిపోవుదమని భావించువారు, మనతోనే కలియక తప్పినదికాదు. చివరకు మూడుసంస్థానములుమాత్రము మిగిలిపోయినవి - జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్ - ఈ మూడు సంస్థానములవిషయములలో జోక్యము చేసికొనుటకే పాకిస్థాను కవకాశము కలిగినది. దొంగలవలె, బందిపోటువలె, మన యాంతరంగిక వ్యవహారములోఁ గల్పించుకోవలదని వారిని మనము హెచ్చరించితిమి. కాని మన హెచ్చరికలను వారు పెడచెవిని బెట్టిరి.

"జునాగఢ్ సంస్థానము పాకిస్థాన్‌లో జేరినట్లు, జునాగఢ్ నవాబుచేఁ బ్రవేశ నియమావళిపై సంతకము చేయించిరి. ఆ నవాబుకు వా రాశ్రయమిచ్చి రక్షణ కల్పించవలసివచ్చెను. కాని పాకిస్థాన్‌లో ననుభవించు స్వాతంత్ర్యముకంటె నిండి