ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

వల్లభాయిపటేల్

"ఈయన నాయందుఁ జూపు ప్రేమ మా తల్లిగారు నా పట్లఁ జూపిన వాత్సల్యమును జ్ఞాపకము చేయుచున్నది. మాతృదేవత కుండు లక్షణము లీయనకున్న ట్లింతకుముందు నే నెఱుఁగను."

1942 ఆగష్టు 9 వ తారీఖున క్విట్ ఇండియా తీర్మాన కారణముగా వర్కింగుకమిటీ మెంబర్లతోపాటు డిటెన్యూగా దీసికొని పోఁబడెను.

ఆ వర్కింగుకమిటీ మెంబరులనుగుఱించి, వారి కార్య కలాపములనుగుఱించి, పట్టాభిగారు చెప్పినమాటలు గమనింపఁ దగినవి.

              "మౌలానా ఆజాద్ ప్రధానపురుషుఁడు.
               వల్లభాయి - యందఱకంటె వివేకము గలవాఁడు.
               జవహర్‌లాలు - చుఱుకైనవాఁడు.
               అసఫ్‌ఆలీ - యాలోచన గలవాఁడు.
               సైయ్యద్ అహమ్మద్ - నెమ్మదియైనవాఁడు.
               పండిత్ పంత్ - నిశితమైనవాఁడు.
               డాక్టర్ ఘోష్ - శాస్త్రదృష్టికలవాఁడు
               శంకరరావ్ దేవ్ - సేవాశీలములు గలవాఁడు.
               కృపలానీ - అధికారముగలవాఁడు.
               నరేంద్రదేవ్ - విద్యాశక్తిగలవాఁడు.
               హరికృష్ణమెహతాబ్ - కళాసంపత్తికలవాఁడు."
               పట్టాభిగారు - ఏమి వ్రాసికొనకపోయినను నన్నియుఁ దెలిసినవాఁడని మన మనవచ్చును.