పుట:2015.328731.Neeti-Chendreka 0002.pdf/1

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షిని డాఁచినట్టిసర్వ
జ్ఞుని నాచనసోమనాథు స్తుతి యొనరింతున్.

ప్రతిజ్ఞాదికము

తే.

ఒనరఁగాఁ బంచతంత్ర హితతోపదేశ
ములను బరికించి వానిలో వలయు నంశ
ములను గొని కొంతయభినవంబుగను గూర్చి
కృతి యొనర్చెద నీతిచంద్రిక యనంగ.


క.

తుదముట్టఁగ నీకబ్బము
పదిలముగాఁ జదివినట్టిబాలుర కోలిం
బొదలును భాషాజ్ఞానము
కుదురుం గొద లేక నీతికుశలత్వంబున్.


తే.

విద్య యొసఁగును వినయంబు వినయమునను
బడయుఁ బాత్రతఁ బాత్రతవలన ధనము
ధనమువలనను ధర్మంబు దానివలన
నైహికాముష్మికసుఖంబు లందు నరుఁడు.


ఆ.

జరయు మృతియు లేని జనునట్లు ప్రాజ్ఞుండు
ధనము విద్యఁ గూర్పఁ దలఁపవలయు
ధర్మ మాచరింపఁ దగు మృత్యుచేఁ దల
వట్టి యీడ్వఁబడినవాఁడుఁబోలె.


ఆ.

నీతి లేనివాని నిందింత్రు లోకులు
లేదు నేగి లాఁతి లేక యున్నఁ
గాన మానవుండు పూనిక నయవిద్య
గడనసేయ మొదలఁ గడఁగవలయు.