పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/74

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

71

ములు గలవారును బలాఢ్యులు నైనతుండీరమండలాధిపతి యగు కృష్ణప్పనాయకుఁడును పాండ్యమండలాధిపతి యగు ముద్దువీరప్పనాయఁడును వేంకటపతిరాయలయెడఁ గల పూర్వ ద్వేషమును బురస్కరించికొని జగ్గరాయలపక్షమునఁ జేరినందున నతనిబల మెక్కువగా నుండెను. అందుచేత యాచమనాయఁడు తనపక్షమున నింకను సైన్యము నధికముగ సమకూర్చు కొనవలసియుండుటచేత మనస్ఫూర్తితో జగ్గరాయల సైన్యముల నెదుర్కొనక తప్పనిపట్టుదల సర్వరక్షణార్థము పోరాడుచు గాలయాపనము సేయుచుండవలసి వచ్చెను గాని పౌరుషము కొఱవడి గాదు. జగ్గరాయల సైన్యములు తుండీరమండలాధిపతి యగు కృష్ణప్పనాయకుని సైన్యములతోఁ గలిసికొని రామదేవరాయనిఁబట్టుకొనుటకై రామదేవరాయని పక్షమునుబూనిన సైన్యములను, అనఁగా యాచమనాయనిఁ జేరిన సైన్యముల నెదుర్కొనుచు నచట రామదేవరాయలు లేకుండుట దెలిసినేని వారిని వీడి మరి యొకసైన్యమును దలఁపడు చుండెను. వేంకటపతిరాయల యెడఁగల పూర్వవైరమును పురస్కరించుకొని తుండీర మండలాధిపతి యగు కృష్ణప్పనాయకుఁ డిదివఱకె జగ్గరాజు సైన్యములనుఁ గలిసికొని చిక్కుకలిగించుచున్నాడు. మధుర నాయకుఁడును వీరవేంకటపతిరాయలయెడఁ గలపూర్వవైరములను బాటించియె జగ్గరాయనికి బాసట యయ్యెను. జగ్గరాజు, తుండీరమండలాధిపతియు గలిసి మధురనాయకుఁడగు