పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

55

అవశ్యము రావచ్చును. తా నెప్పుడు సిద్ధముగా నున్న నప్పుడే రావచ్చును. ఎప్పుడు వచ్చినను యాచమనాయఁడ నైన నేను నావంటి మనుష్యులతో నిరీక్షించి యుందును. పో; పొమ్ము; పోయి నాయీపలుకులు జగ్గరాయల దర్బారులో పలుకుము. ఈపలుకులు విన్నమాత్రమున జగ్గరాయలకు మిన్నువిఱిఁగి మీఁదబడినట్లు తోఁచెను.

అప్పు డతఁ డిట్లు తలపోసికొనియెను. "ఇతఁడు నిక్కముగా శూరుఁడే. తాను తనబొందెలోఁ బ్రాణము లున్నంత దనుక రంగరాయల పక్షమునఁ బోరాడుటకు నిశ్చయించి కొని యున్నవాఁడు. ఇట్టివానిపట్ల సామదానభేదదండోపాయములను, జతుర్విధసాధనములనుఁ బ్రయోగింపవలయును. ముందుగా దండోపాయమువలన నపాయము వాటిల్లఁ గలదు. ఇప్పు డితనితో యుద్ధము దలపెట్టినయెడల దామర్ల వెంగళనాయఁడు, దామర్ల చెన్నప్పనాయఁడు మొదలుగా నీతని బంధువర్గమువా రందఱును నీతనిపక్షమునఁ జేరుదురు. అప్పుడు రంగరాయల బంధువర్గము వీరినిఁ జేరుదురు. తక్కిన మండలాధిపతులను నాపక్షమున నిలుపుకొనుట దుస్సాధ్యమగును. ఈతని సామముచేతను, దానములచేతను జక్కపఱుపజూతును."

ఇట్లు తలపోసి యాచమనాయని ననేకవిధములుగాఁ గొనియాడుచు 'నీవు నామేనల్లునిపక్షమున నుందు వేని విశేషముగా వరుంబడి వచ్చెడి భూములను నొసంగుచు నిన్ను