పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

వెలుగోటి యాచమనాయఁడు

రాయలవర్గమువారికిఁ బొడకట్టెను. అంత రాయల సైనిక వర్గమువారు దుర్గద్వారములను మూసివేయఁ జూఁచిరి. అప్పటికే కార్యము మించిపోయినది. అంతయు నిష్ప్రయోజనముగాఁ బరిణమించెను. జగ్గరాజు సైనికభటులు రాయల దుర్గరక్షకులను సంహరించుచు నంతఃపురభాగములకుఁ బఱు విడు చుండిరి. ఇంతలో నొక శత్రునాయకుఁ డొకఁడు రాయలనుఁబట్టికొని జగ్గరాజుకడకుఁ దీసికొనివచ్చి 'ఇదిగో! రాయలను నీకర్పించు చున్నా' నని పలికెను.

అతఁడు రంగరాయలను జూఁచి "రంగరాజా! నీవు నాకు ఖైదీవయినావు. నీ విఁక నిశ్శబ్దముగ నావలికి పోతివా నీ ప్రాణములను నీవు సంరంక్షించుకొనఁగలవు. ఈదినము మొదలుకొని రాజ్యకాంక్ష విడిచి సామ్రాజ్యముపైఁ గల హక్కునంతయు వదలుకొని మరల యెన్నఁడును జేపట్టుటకుఁ బ్రయత్నింపకుండుము" పొమ్ము అని పలికెను.

అతఁడు మోసపోయెను. దుర్గ మంతయు శత్రుసైన్యములతో నిండిపోయెను. ఇంక చేయున దేమి గలదు? అట్టి కఠిన మైన యాజ్ఞకుఁ దలయొగ్గక తప్ప దయ్యెను. ఆ దురదృష్టవంతుఁడు తనభార్యను, బిడ్డలను దీసికొని క్లేశముచే వాడిపోయిన మోమును, వాల్చిన కన్నులును గలిగి మాఱు మాటలేక తల వంచికొని పోవుచుండెను. ఒక్క మనుష్యుఁ డయినను నమస్కరించువాఁడు లేఁ డయ్యెను. ఇది ద్రోహమని పలికినవాఁడు లేకపోయెను. ఆక్షణమువఱకు రాజుగ