పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/40

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వనాథనాయకుఁడు

37

తిరువడి రాజ్యాధిపతి యగు భూతల శ్రీవీరరామవర్మయును పోర్చుగీసువారును క్రైస్తవమత మవలంబించిన పరవజాతివారును దక్షిణదేశమున సామ్రాజ్యాధికారమును దొలఁగించి యాస్థానమున పోర్చుగీసువారి రాజ్యాధికారమును స్థాపించుటకై ప్రయత్నించిన విధానమును భగ్నపఱచుటకును, ఈ ప్రాంతదేశమున విజయనగర సామ్రాజ్యప్రతిష్ఠను స్థిరముగా నెలకొల్పుటకును విఠ్ఠలరాయలు నియోగింపఁబడి పదిసంవత్సరములకాల మిచట నుండి తనప్రయత్నము లన్నిటిని విజయము గాంచెను. ఈకార్యములయందు పాండ్యరాజ్యమును బరిపాలించు విశ్వనాథనాయనివారును, వానికుమారుఁడు కృష్ణప్పనాయనివారును తోడ్పడినమాట వాస్తవమెకాని విశ్వనాథనాయనివారు పాండ్యరాజ్యమును స్వతంత్రముగాఁ బరిపాలనము చేయలేదని కొందఱు చరిత్రకారులు వ్రాసినది సత్యచరిత్రము కాదు. ఇప్పటినుండియు నీతఁడును నీతనివంశము వారును పాండ్యరాజ్యమునకు వంశపారంపర్యపు హక్కు గలిగి యిన్నూఱు సంవత్సరముల వఱకుఁ బరిపాలింపఁ గలిగిరి. విశ్వనాథనాయనివారు 1496 వ సంవత్సర ప్రాంతమున జనించి 1529 మొదలుకొని 1564 వఱకు పాండ్యరాజ్యమును బరిపాలించి 1564 వ సంవత్సరమున మరణముఁ జెందెను. ఇతనికి 'పాండ్యకుల స్థాపనాచార్య' యను బిరుదము గలదు. ఇయ్యది బహుశః తెంగాశి పాండ్యులను మరల వారివారి