పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

విశ్వనాథనాయకుఁడు

పాండ్య దేవుఁడే' యనియుఁ దక్కినవారు విశ్వనాథనాయని వారికి సామంతులై మైత్రితితోఁ బ్రవర్తించి రని మనము నిశ్చయింపవచ్చును.

ఈవిశ్వనాథనాయనివా రెంతసమర్థుఁడైనను, ఎట్టిరాజ్య తంతజ్ఞుఁడైనను, ఒకటి రెండుమాఱులు సామ్రాజ్యము వారి సహాయమును గోరక తప్పినది కాదు. ఇతఁడు తెంగాశి పాండ్యులతోఁ బోరాడుచున్న కాలమున పోర్సుగీసువారు సముద్రతీరమునందు నివసింపుచు ముత్తెపు చిప్పలను సముద్రమునుండి దేవి తెచ్చి వ్యాపారము చేసెడి పరవజాతివారిని పెక్కండ్ర క్రైస్తవమత ప్రవిష్టులనుగాఁ జేసి వారిసహాయముతో సముద్రతీరము నాక్రమించుకొని సముద్రవ్యాపార మంతయుఁ దమహస్తగతమగునటుల వ్యవహరింపుచు పరవజాతి వారిని పాండ్యరాజ్యపరిపాలనమునుండి వేఱిపఱచినను నేమియుఁజేయ శక్తిచాలక యుండెను. ఇంతియగాక తిరువడి రాజ్యాధిపతి యైనభూతల వీరరామవర్మ పోర్చుగీసువారి సహాయముచే గర్విష్టుఁడై కప్పముగట్టుట మానుకొనుటయెగాక పాండ్యరాజ్యములోని కొంతభాగ మాక్రమించు కొనుటకుఁగూడ సాహసించెను. ఈ దుస్థితినంతయుఁ దెలిసికొని విజయనగరసామ్రాజ్యసంరక్షణ కర్తయగు అళియరామరాయలవారు విశ్వనాథనాయనివారికిఁ దోడ్పాటుగానుండి పోర్ఛుగీసువారియొక్కయు, తిరువడిరాజ్యాధిపతియొక్కయు,