పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/25

ఈ పుట ఆమోదించబడ్డది

22

విశ్వనాథనాయకుఁడు

తమ్ముఁ డచ్యుతదేవరాయలవారు విజయనగరసామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తులయిరి. అప్పుడాయన తన మఱదలి పెనిమిటి యైన చెన్వప్పనాయనివారిని చోళ రాజ్యప్రతినిధిగా నియమించిరి గావున నప్పటినుండియు నారాజ్యము విశ్వనాథనాయని వారి పరిపాలనమునుండి తొలఁగిపోయెను. రాయలవారి యుత్తరువు ననుసరించి తిరుచునాపల్లె మధురరాజ్యమునకును వల్లము తంజాపురరాజ్యమునకును జేరిపోయినవి. ఆకాలమున తిరుచునాపల్లెకు సమీపమునఁ గావేరినది కిరుపార్శ్వముల నడవులు బలిసి దొంగల కునికిపట్టులై శ్రీరంగ మనుపుణ్యక్షేత్రమునకు వచ్చుచుబోవుచుండెడు యాత్రికుల కపాయకరములై యుండుటచేత విశ్వనాధనాయనివారియాజ్ఞ ననుసరించి దళవాయి కేశవప్పనాయఁ డా యడవులన్నిటిని భేదింపఁజేసి దొంగల నిలువరమునెల్ల నాశనము గావించి రక్షకభటుల నందందు నెలకొల్పి యాత్రికులకు మానప్రాణరక్షణముల నొసంగెను. ఇంతియెగాక తిరుచునాపల్లెదుర్గముచుట్టును రెండు ప్రాకారములను నిర్మించి వానిప్రక్కను నొక పెద్దకందకమును ద్రవ్వించి పురమునకు మంచిరక్షణ కలుగఁజేసెను.

మఱియు విశ్వనాథనాయనివారు శ్రీరంగము, తిరుచునాపల్లె దేవాలయముల విషయమై మిగుల శ్రద్ధవహించి యనేకరీతులుగా వానినభివృద్ధికిఁ దీసికొనివచ్చెను. ఈయనకాలముననే సుందరమైన తెప్పాకుళమనెడు కోనేరు నిర్మింపఁబడి తిరుచునాపల్లె కొకవినూతన మైనసౌందర్యమును గలుగఁజే