పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

14

విశ్వనాథనాయకుఁడు

ఇట్టి సంభాషణము జరిగినవెనుకఁ బదిదినములకు విశ్వనాథనాయఁడు స్వసైన్యములతో విజయనగరముఁ బ్రవేశించి తనతండ్రి యైన నాగమనాయనిఁ గొనివచ్చి రాయలవారి యెదుట నిలువం బెట్టెను.

అపుడు కృష్ణదేవరాయలవా రాగ్రహమునుఁ జూపక మందహాసముసేయుచు 'ఓయీ నాగమనాయఁడా! నీవు స్వామి భక్తిపరాయణులలో నగ్రగణ్యుడవని మేము విశ్వసించి చంద్రశేఖరపాండ్యునిరాజ్యము వీరశేఖరచోడుఁ డాక్రమించినందున వానిజయించి పాండ్యరాజ్యమును చంద్రశేఖర పాండ్యుని కొసంగి పాండ్యరాజ్యమున శాంతి నెలకొల్పి రావలసినదిగా మే మాజ్ఞాపింప విశ్వాసఘాతకుఁడవై పాండ్యరాజ్యమును పాండ్యునికీక చోళపాండ్య రాజ్యముల రెంటిని నాక్రమించి నీవే యేలుటకుఁ బ్రారంభించి మాపై కత్తిగట్టఁ బ్రయత్నించిన వాడని నిదియేమి యాగడ'మని హెచ్చరించెను.

అంత నాగమనాయఁడు రాయలవారి కిట్లు విన్నవించు కొనియెను.

"స్వామీ! నేను చేసిన మహాపరాధ మేమియును లేదు. మీ తండ్రిగారు పాండ్యరాజ్యమును మా --------- కుదునయుంచినారు. అప్పటినుండి పాండ్యరాజ్యమునుండి తగిన రాబడి వచ్చుటకై మాస్వంతద్రవ్యములతో వ్రయపెట్టి నష్టపడియున్నాము. ఇదిగాక యిప్పుడు దేవరవారు చోళరాజునుఁగొట్టి పాండ్యరాజునకు రాజ్యమిమ్మని సెలవు దయచేసి