పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

10

విశ్వనాథనాయకుఁడు

ఈ జాబు అందినవెంటనే నాగమనాయఁ డాశ్చర్యమును జెంది కుమారునికి రాయలయెడఁగల భక్తివిశ్వాసములుఁ దలపోసి తనలోఁ దాను మెచ్చుకొనుచు నిట్లు ప్రత్యుత్తర మంపెను.

"కుమారా! నావలె నీవును సామ్రాజ్యమునకు శత్రువులయినవారిని సాధించి సామ్రాజ్యమును విస్తరింపఁ జేసినావు. రెండుతడవులు సామ్రాజ్యము చిక్కులపాలఁ బడినపుడు నిలువఁబెట్టినాము. నీ వెట్టియుపకారము చేసినను దానివలనఁ గలిగిన ఘనత నన్నుఁగూడఁ జెందవలయును గదా! రాయలు మనపట్ల విశ్వాసముగలవాఁ డయినపుడు పాండ్యరాజ్యమును నొక దాసీపుత్రుఁ డనుభవించిన నాయనకు గలిగెడు లాభమేమి? మన మనుభవించినఁ గలిగెడు నష్టమేమి? నేను విశ్వేశ్వరుని గూర్చి తపస్సుచేసి నిన్నుఁ గని యా దేవదేవుని పేరే నీకు పెట్టి యున్నాను. నీ వొక్కండవే నా కుమారుఁడవు. నాతో నెందుకు యుద్ధమొనర్తువు? ఈ రాజ్యనిర్మాణమంతయు నీ కొఱకేగాని నానిమిత్త మెంతమాత్రమును గాదు. నీవు రాయలను విడిచి నాతో నుండుము.

ఈ ప్రత్యుత్తరమును జదువుకొని విశ్వనాథనాయఁడు మరల యిట్లు సమాచార మంపెను.

"మీరుచేయునదిస్వామిద్రోహము. మిమ్మునమ్మిసమస్త భారము మీ పైని పెట్టిన ప్రభువును మోసపుచ్చి రాజ్యముఁ గట్టుకొని ద్రోహి నాకు తండ్రియని సహించి యపకీర్తి భరిం