పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/11

ఈ పుట ఆమోదించబడ్డది

8

విశ్వనాథనాయకుఁడు

గినదానిని గొడ్డళ్ళతోఁ దునుమవలసివచ్చును. మహాప్రభూ! నేను చేసినద్రోహ మేమియును లేదు. నే నింతవఱకు నాజీవితము సామ్రాజ్యసేవయందే గడిపి కష్టపడి యున్నవాఁడను గావునఁ గొంతలాలమయిన సుఖపడ నభిలషించుట తగదా? ఈరాజ్యాభివృద్ధికై నా ద్రవ్యమంతయు వెచ్చఁ బెట్టియున్నాను గనుక నాద్రవ్యమును రాఁబట్టుకొనునంతవఱకు నిచటనేయుండి సామ్రాజ్యమున కేవిధమయిన నప్రఖ్యాతియుఁ ద్రవ్యనష్టము గలుగుకుండఁ బరిపాలనముచేసి నేను జేయవలసినకార్యముల నన్నిటిని నెఱవేర్చుకొని దేవరసాన్నిధ్యమునకు దేవరవారి యాజ్ఞాప్రకారము వచ్చుచున్నాను. ఇప్పుడే దేశమును విడిచి వత్తునేని నా ద్రవ్యమునంతయు నేను గోల్పోవుటమాత్రమె గాదు. ఈ దేశమంతయు నరాజకమై యల్లకల్లోలము గాఁ గలదు. తరువాత దేవర చిత్తమువచ్చినట్లు గావింపుఁడు."

ఈవిజ్ఞాపనముఁజదువుకొన్నమీఁదట గృష్ణదేవరాయలు తోకఁ ద్రొక్కఁబడిన త్రాఁచువలె లేఁచి "ఔరా! నాగమనాయఁ డెంతపనిచేసెను. నమ్మించి స్వామిద్రోహమునకుఁ గడంగెను; ఇంకనేల వీని మన్నింపవలయును; ఈద్రోహి తలఁబట్టి యీడ్చుకొని రాఁ గలిగినవీరపురుషుఁ డెవ్వఁడయిన నీ దర్బారులో నుండెనా యని ప్రశ్నింపుచుఁ గొల్వుకూటము నంతయుఁ దేఱిపాఱఁజూచెను. అందఱు నివ్వెఱపడి చూచు చుండ నాగమనాయనికుమారుఁడే విశ్వనాథనాయఁడు నువ్వెత్తు