పుట:1857 ముస్లింలు.pdf/58

ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లింలు

మేధోపోరాటం సాగించారు. ఆ కోవకు చెందిన వారిలో మౌల్వీ ఫజల్‌ హఖ్‌ ఖెరతాబాదీని ప్రముఖంగా చెప్పు కోవాలి. ఆయన తాను నిర్వ హిస్తున్న తహశీల్దార్‌ పదావిని వదాలుకుని మొగల్‌ చక్రవర్తి బహదాూర్‌ షా జఫర్‌కు అండదాండగా నిలిచారు. ఆంగ్లేయుల మీద యుద్ధానికి సిద్ధాం కమ్మని ప్రజలకు పిలుపు నిచ్చిన ప్రథామస్వాతంత్య్ర సంగ్రామం నాటి చారిత్రాత్మక ఫత్వాను తయారు చేయటంలో ఆయన భాగ స్వాములయ్యా రు. ఆంగ్లేయుల తరిమివేత తరువాత తయారుచేయబడిన మహాపరిపాలనా మండలి రాజ్యాంగ రూప కల్ప నలో ఆయన పాలుపంచుకున్నారు. ఈ చర్యలకు గాను ఆయన ప్రవాస శిక్షకు గురై అండమాన్‌కు పంపబడిన తొలినాటి స్వాతంత్య్రసమరయోధాులలో ఒకరయ్యారు.

స్వదేశీ పాలకుల కోసం తిరుగుబాటు మార్గం

బ్రిటీష్‌ పాలకులను ఏమాత్రం సహించలేకపోతున్న ఆయా ప్రాంతాల ప్రజలు,ప్రముఖులు ఆంగ్లేయుల మీద ఎవరు తిరగబడినా ఆ ప్రాంతంలో తిరగబడిన స్వదేశీ సంస్థానాధీశులకూ స్వదేశీ యోధులకూ, నేతలకూ అండగా నిలచారు.ఈ విధంగా సర్వసంపదాలను, చివరకు తన ప్రాణాలను కూడ పణంగా పెట్టిన యోధుల లో ప్రముఖ సైనికనాయకుడు నబీబక్ష్‌ ఖాన్‌ ముఖ్యలు. బీహార్‌ రాష్ట్రానికి చెందిన జగ్దీష్‌పూర్‌ సంస్థానా ధీశుడు బాబు కన్వర్‌ సింగ్‌ కు ఆయన బాసటగా నిలిచారు.ఆ సమయంలో నబీ బక్ష్‌ ఖాన్‌ బాటలో షేక్‌ గులాం యహ్యా, షేక్‌ ముహమ్మద్‌ అజీముద్దీన,తౌరబ్‌ అలీ, హైదారాలీ ఖాన్‌, అహ్మదాలీ ఖాన్‌, మెహది అలీ ఖాన్‌, హుసైన్‌ బక్ష్‌ ఖాన్‌ తదితర యోధులు కన్వర్‌ సింగ్‌ పక్షాన ఆంగ్లేయులను ఎదుర్కొన్నారు. ఆంగ్లేయులతో సాగిన పోరాటంలో చివరి క్షణం వరకు ఓటమిని అంగీకరించక నబీ బక్ష్‌ ఖాన్‌ పోరాడుతూ కదనరంగాన కన్నుమూశారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అయోధ్యా నవాబు రాజ్యంలో భాగమైన గోరఖ్‌పూర్‌కు శ్రీ హన్మంత్‌ సింగ్‌ సంస్థానా ధీశుడు. ఆయనను ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు అవమానకరమైన రీతిలో పదావీచ్యుతుని చేశారు. ఆ అనుచిత చర్యపట్ల ఆగ్రహించిన సంస్థానానికి చెందిన నాజిమ్‌ ముహమ్మద్‌ హసన్‌ ఖాన్‌కు మీర్‌లో రగిలిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఉత్సాహాన్నిచ్చింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులపై అవథ్‌ బేగం హజరత్‌ మహల్‌ పూరించిన సమర శంఖారావం ఆయనలో మరింత ఆత్మవిశ్వాసం కలిగించింది. దీంతో హసన్‌ఖాన్‌ గోరఖ్‌పూర్‌లో తిరుగుబాటు పతాకాన్ని ఎగురవేసి గోరఖ్‌పూర్‌ను స్వతంత్య్ర రాజ్యంగా ప్రక టించారు.

55