పుట:1857 ముస్లింలు.pdf/42

ఈ పుట ఆమోదించబడ్డది

స్వాతంత్య్ర సమరయోధుల శరీరాలలో అగ్ని పుడుతుంది. ఆ అగ్ని జ్వాలల వేడిమిలో విూ ప్రభుత్వం, విూరూ మాడి మసైపోవటం తథ్యం. ఈ విధమైన ధిక్కారంతో బ్రిటీష్‌ పాలకుల భవిష్యత్తును పీర్‌ అలీ స్పష్టంగా ప్రకటించారని ఆంగ్లేయ అధికారి విలియం టేలర్‌ తన గ్రంథంలో పేర్కొన్నాడు.( Hindusthani Musalmano Ka Jang-eazadi mein Hissa (HIndi), Syed Ibrahim Fikri, Published with the Financial Assistence of Govt. of India, New Delhi, 1999, P. 21).
చివరకు పీర్‌ అలీని జూలై 3న ఉరితీసి ఆ యోధునికి గౌరవప్రదమైన అంత్యక్రియలు కూడా లేకుండా చేసి ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆంగ్లేయాధికారులు తమలోని క్రూరత్వాన్ని వెల్లడించుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అవధ్‌ రాజ్యంలో విజృభించిన మౌల్వీ అహ్మదుల్లా షా ఫైజాబాది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో నూతన చరిత్ర సృష్టించారు. యువకుడిగా ఉన్నప్పటి నుండి ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన మౌల్వీ 1857 జూన్‌లో ఆంగ్లేయుల చెఱసాల నుండి విముక్తుడై తన అనుచరులతో కలిసి పోరుబాటన సాగారు. ఆంగ్లేయ సైనికులు తారసపడిన చోటల్లా ఎదుర్కొని వారిని మట్టి కరిపించారు. స్వదేశీ యోధుల విజయపరంపరను కొనసాగిస్తూ ఆయన అవధ్‌ మహారాణి బేగం హజరత్‌ మహాల్‌తో కలిసి ఆంగ్లేయులను ఎదుర్కొనేందుకు లక్నో చేరుకున్నారు. ఈ క్రమంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులను పలు పోరాటాలలో ఆయన పరాజితుల్ని చేశారు. ఈ యోధుని విక్రమాన్ని ఎదుర్కొలేకపోయిన కంపెనీ అధికారులు ఆయనను పట్టిచ్చిన వారికి 50 వేల రూపాయల నజరానా కూడా ప్రకటించాల్సి వచ్చింది. చివరి వరకు రాజీలేని పోరు సలిపిన ఆయన ఈస్ట్‌ ఇండియా కంపెనీ తొత్తు సాగించిన నమ్మకద్రోహం వలన హతమయ్యారు.
ఈ విషయాన్ని వి.డి. సావార్కర్‌ తన 1857 స్వరాజ్య సంగ్రామం లో ప్రస్తావిస్తూ ' ..రాజా ప్రక్కనే ఉన్న అతడి సోదరుడు మౌల్వీ పై గురిచూసి కాల్పులు జరిపాడు. ఆ దుర్మార్గుని హస్తాలలో మౌల్వీ హతుడైపోయాడు. ఆ పిరికిపందలు..మౌల్వీ శిరస్సు ఖండించి, దాని పై గుడ్డ కప్పుకొని చేరువనే 13 మైళ్ళ దూరాన ఉన్న బ్రిటీషు ఠాణా - షాజహన్‌పూరుకు తీసుకు వెళ్ళారు...రక్తం ఓడుతున్న ఆ పవిత్ర శిరాన్ని ఆ నీచులు ఆంగ్లేయుల ముందు కానుకగా ఉంచి వారి పాదాల చెంత మోకరిల్లారు...నీచమైన