పుట:1857 ముస్లింలు.pdf/269

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

అనే పాఠ్యాంశంలో, 'ముస్లిం రచనల్లో మధ్యయుగపు ఆంధ్రుల చారిత్రక విశేషాలు సందర్భానుసారంగా తెలుస్తున్నాయి..'మసునూరి, రెడ్డి, వెలమ రాజ్యాలు' అనే పాఠ్యాంశంలో, 'కాకతీయ సామ్రాజ్య పతనానంతరం కళింగం మినహా తెలుగుదేశమంతా మహమ్మదీయ అధికారుల దుష్టపరిపాలనను చవిచూడడం తెలిసిందే (పే.92), 'తెలంగాణాలో జాతీయోద్యామం-1921 నుంచి' అనే పాఠ్యాంశంలో కొంతమంది ముస్లిం తీవ్రవాదాులు హిందువులను కించపరుస్తూ హతమార్చమని విశ్వవిద్యాలయంలోనే ఉపన్యాసాలిచ్చేవారు (పేజి. 122) విం మతతత్వ పదజాలం ఉంది.

ఈ విధగా మధ్య యుగాల చరిత్రనుండి ఆధునిక చరిత్ర వరకు ఎన్నో అంశాలను పాఠ్యగ్రంథాలలో పొందుపర్చడం వలన భావిభారత పౌరుల మనస్సుల మీద ముస్లిం ప్రజానీకం పట్ల ఎటువిం వికృత-విద్వేష భావాలు స్థిరపడతాయో అవగతం చేసుకోవచ్చు. ఈ ప్రమాదకర భావజాలం విద్యార్థినీ/విద్యార్థులను పూర్తిగా తప్పుదారి పట్టించి, వారిలో మతతత్వ పోకడలను పెంపొందించింది (పెంపొందిస్తోంది) అని డాకర్‌ సాంబశివారెడ్డి చరిత్ర పాఠ్యపుస్తకాలపై మతత్వం నీడలు (గీటురాయి వారపత్రిక, 11-8-2006, హైదారాబాద్‌, పేజిలు 1-2) అను తన వ్యాసంలో వ్యాఖ్యానిస్తూ SV University, Thirupathi, Three Year Degree (B.A Regular) Examinations, March and October 2005, History, Part - II, Paper I and IVలలో విద్యార్థులు పేర్కొన్న సమాధానాలను ఉటంకించారు. ఆ సమాధానాలు ఇలా ఉన్నాయి:

'శ్రీకృష్ణదేవరాయలను' గురించి, ...శ్రీకృష్ణదేవరాయలపైన, హిందూ సంస్కతిపైన బిజాపూర్‌ సుల్తాన్‌ యూసుఫ్‌ ఆదిల్‌ఫా 'జిహాద్‌' (ప్రకటించాడు)..., ...(విజయనగ ర రాజులకాలంలో) హిందువులు ఎక్కువగా ఉండేవారు . మహమ్మదీయులు అల్పసంఖ్యాకులు...,...విజయనగ ర సామ్రాజ్యంలో మహమ్మదీయులైన బహమనీ సుల్తానులు విజయనగరంపై జిహాద్‌ ప్రకటించారు..., ...మహమ్మద్‌ అలీ (ఆదిల్‌ షా) విజయనగ రం పై జిహాద్‌ ప్ర కటిస్తాడు (ప్రకటించాడు)..., అళియరామ రాయల' పై ...ప్రపంచంలో ఎక్కడా జరుగని దారుణం విజయనగర సామ్రాజ్యంలో (తళ్ళికోట యుద్ధంసమయంలో) జరిగింది...., అళియ రామరాయల' పై ముస్లిం దురభిమానాన్ని రెచ్చగొట్టాడు..., ...ఈ యుద్ధం (తళ్ళికోట యుద్ధం)లో అనేక లకల మంది హిందువులు మరణంచిరి..., 'మహమ్మద్‌బిన్‌

266