పుట:1857 ముస్లింలు.pdf/250

ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం - 9

విస్మరణకు గురైన త్యాగాలు

1957లో ప్రథమ svaaతంత్య్ర సంగ్రామం వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం శతాబ్ది సంబరాలను ప్రకటించింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. అలనాటి యోధులను సంస్మరణార్థం సభలూ సమావేశాలు నిర్వహించారు. ఆ యోధుల సాహసోపేత త్యాగాలను గుర్తుచేస్తూ పలు గ్రంథాలు ప్రచురితమయ్యాయి.

ఈ సంబరాల పరంపరలో మాతృభూమి పట్ల అపార ప్రేమాభిమానాలు వెలడస్తూ,

ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని అసమాన ధైర్య సాహసాలతో అపార బలసంపత్తి

కలిగిన ఆంగ్ల సైన్యాలతో పోరాడి సర్వం త్యాగం చేసిన ముస్లిం యోధుల త్యాగాలను ప్రభుత్వాలు, ప్రజలు తగినంత గుర్తింపు-గౌరవం ఇవ్వకుండా విస్మరించారు. ఈ విధంగా విస్మరణకు గురైన ప్రముఖులలో బేగం హజరత్‌ మహల్‌, మౌల్వీ అహ్మదుల్లా ఫైజాబాది, అజీముల్లా ఖాన్‌, ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌, బేగం అజీజున్‌, మౌల్వీ లియాఖత్‌ అలీ, మౌల్వీ అహ్మద్‌ అలీ ఖాన్‌, సర్దార్‌ హిక్మతుల్లా , షెహజాదా ఫిరోజ్‌ షా లాంటియోధులు ఎందారో ఉన్నారు.

247