పుట:1857 ముస్లింలు.pdf/224

ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్లేయుల రాక్షసత్వం

అవధ్‌ రాజధాని లక్నోలోని కైసర్‌ బాగ్ లో 1858 మార్చి 15న జరిగిన దోపిడి కాండకు ఆయన ప్రత్యక్షసాక్షిగా ఉన్నాడు. సంపన్నుల గృహాలలో, రాజప్రాసాదాలలో జొరబడిన ఆంగ్ల సెనికులు, అధికారులు, అధికారుల ఏజెంట్లు దోపిడీ సమయంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఆయన తన వార్తలలో సవిరంగా పేర్కొన్నాడు. 1858 మే 25న న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌ కు ఫెడ్రరిక్‌ ఏంగెల్స్‌ రాసిన వ్యాసంలో అవధ్‌ రాజధాని లక్నోలో ఆంగ్ల సైన్యాలు సాగించిన దోపిడ-విధ్వంస కాండలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా వ్యాఖ్యానించాడు:

పందొమ్మిదవ శతాబ్దిలో నాగరిక సైన్యం ఇలాంటి చర్యలు అవలంబించవలసి వచ్చిందంటే పరిస్థితు లు నిజంగా ఎంతగా దిగజారిపోయాయో తెలుస్తుంది ; ప్రపంచంలో మరెక్కడైనా సరే మరేదేశం సైన్యాలైనా ఈ అత్యాచారంలో పదోవంతు జరిపి ఉండిన పక్షంలో బ్రిటిష్‌ పత్రికలు వాటిని ఎంత అపకీర్తి పాల్జేసి ఉండేవో కదా! ఇవన్నీ బ్రిటిష్‌ సైన్యమే కావించిన ఘనకార్యాలై ఉండడం కారణంగా, ఇవన్నీ యుద్ధం తరువాత స్వభావికంగా సంభవించే పర్యవసానాలేనని మనతో ఇప్పుడు చెబుతున్నారు... విచ్చలవిడిగా జరుగుతూన్న బందిపోట్లనూ అత్యాచారాలనూ ఆపడానికి, యుద్ధం మధ్య లో తన సైన్యాన్నే నిరాయుధులను చేయడం కాంబెల్‌కి తప్పంది కాదాంటే..ఇంత పశుప్రాయ మెన సెన్యం ఒక్క బ్రిటన్‌ బ్రిటన్‌లో తప్ప యూరప్ లోగాని మరెక్కడాగాని లేదు ...పన్నెండు దినాలు అహోరాత్రులు లక్నోలో బ్రిటిష్‌ సైన్యమంటూ లేనేలేదు. అక్కడున్నదల్లా ఆ పట్నం నుండి తరిమివేయబడిన సిపాయిల కంటె హద్ధూపద్దూ మీరి పోవడంలోనూ, దౌర్జన్యంలోనూ, దురాశలోనూ ఎట్టిపోలికా లేకుండా మించిపోయి బందిపోటు ముఠాల కింద దిగజారిపోయి తప్పతాగి పశుప్రాయంగా స్వైరవిహారం చేస్తూన్నత్తే అల్లరి మూకే. 1858లో లక్నోను కొల్లగొట్టిన ఘటన బ్రిటిష్‌ సైనికశాఖ కంతటికీ కళంకంగా కలకాలమూ చరిత్రలో నిలబడి పోతుంది...ఇండియాలో నాగరికతనూ మానవత్వాన్ని ఉద్ధరించేందుకు పురోగమించుతూ బరితెగి పోయినట్టి సైనికులు, దేశీయుల యొక్క చరాస్తులను మాత్రమే నిరాటంకంగా కాజేయగా, వీరి వెనువెంటనే బ్రిటిష్‌ ప్రభుత్వం రంగంలోకి ప్రవేశించి దేశీయులను నిలువునా వొలిచేసి వారి స్థిరాస్తులను కాజేస్తూంది. (ప్రథామ భారత స్వాతంత్య్ర సంగ్రామం 1857-1859, మార్క్స్‌-ఏంగెల్స్‌, ప్రగతి ప్రచురణాలయం,మాస్కో, 1983, పేజిలు. 161-167).

221