పుట:1857 ముస్లింలు.pdf/211

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

విసిగిపోయారో అవగతం చేసుకోవచ్చు. అధికారుల హత్యతో మరింతగా రెచ్చిపోయిన ఆంగ్లేయ సైనికుల క్రూరత్వాన్ని కచ్చా చలాన్‌లో బ్రతికి బట్టకట్టినవారు చవిచూడాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఎంతగా చేయిదాటి పోయిందంటే, ప్రథమ స్వాతంత్ర సంగ్రామ జ్వాలలు పూర్తిగా సమసిపోక ముందే దోపిడకి సిద్దపడు తున్న సైనికులను నిరోధించేందుకు, ప్రస్తుతం సాగుతున్న అత్యంత క్రూర స్వైరవిహారం ఆగి పోయేంతవరకూ యుద్ధ చర్య లను స్వస్తి చెబుతున్నట్టు ఆంగ్లేయ సైనికాధికారి జనరల్‌ కాంబెల్‌ ప్రత్యేంగా ఉత్తర్వులు జారీచేయాల్సి వచ్చింది.

క్రౌర్యానికి పతిరూపమైన ఆంగ్లేయాధికారి

ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామంలో స్వదేశీ యోధుల పట్ల ప్రతి ఆంగ్లేయాధికారి రాక్షసంగా వ్యహరించాడు. ఈ విధంగా వ్యవహరించిన అధికారులలో జనరల్‌ నీల్‌ తరువాత స్థానం కెప్టన్‌ హడ్సన్‌ దే. ప్రజల నుండి ప్రభువుల వరకు, స్వదేశీ యోధుల నుండి ముహమ్మద్‌ బాకర్‌ లాంటి కలం యోధుల వరకు ఎవ్వర్నీ వదలకుండా హత్యాకాండకు గురిచేసన రాక్షసు డితడు . ప్రపంచ నాగరికులలో ఉత్తములమని చెప్పుకునే ఆంగ్లేయులలోని అనాగరికతకూ, క్రూరత్వానికీ ప్రతిరూపమీ 'మహా నాగరికుడు' ! చక్రవర్తి బహదూర్‌ షా జఫరను అరెస్టు చేయడానికి హుమాయూన్‌ సమాధుల వద్దకు సాయుధ బలగాలతో వెళ్ళిన అతడు సమాధుల నిర్మాణం జరిగిన భవంతిలోకి ప్రవశించినా చక్రవర్తిని అరెస్టు చేయ డానికి సాహసించలక, చక్రవర్తి, ఆయన కుటుంబీకుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని విశ్వసించి స్వయంగా బయటకు వచ్చిన జఫర్‌ను అరెస్టు చేశాడు. ఆ తరవాత జఫర్‌కు ఇచ్చిన మాటను తప్పి మొగల్‌ కుటుంబీకులందర్నీ మృత్యువాతకు గురిచేసిన హడ్సన్‌ ఆ తరువాత మొగల్‌ రాకుమారులను నడివీధిలో నిరాయుధుల్ని చేసి కాల్చి చంపిన ఘన చరిత్రగలవాడు. ఆ రాక్షస ఆంగ్లేయాధికారి క్రౌర్యం గురించి ఆంగ్ల చరిత్రకారుడొకడు ఈ విధంగా వ్యాఖ్యానించాడు:

మానవుని బాధ అతనిలో ఎట్టి ఆవేదానా రేకెత్తించదు. రక్తపాతం అతనిలో ఏమాత్రం నొప్పి కల్గించదు. ప్రాణం తీయడం వల్ల అతనికి మానసిక బాధ ఏమీ ఉండదు...అతని ఆనందమల్లా ఓడిపోయి పరారవుతున్న వార్ని నరకడం, పరాజితుల

208