పుట:1857 ముస్లింలు.pdf/200

ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్లేయుల రాక్షసత్వం

అని ఆదేశించాడు.

ఈ మేరకు రెనాడ్‌ తనకు అప్పగించిన బాధ్యతకు గర్వపడి, పై అధికారి ఆజ్ఞను తు.చ.తప్పక నిర్వర్తించాడు. వాళ్ళు మూడు రోజులు కవాతు చేస్తూ వెళ్ళారు.ఇంగ్లీషు వాళ్ళ ప్రతీకార శక్తికి చిహ్నంగా ధ్వంసమైన గ్రామాలను, చెట్ల కొమ్మలకు వేలాడే శవాలను ప్రతిచోటావదలి వెళ్ళాడు అని ఆ ఆంగ్లేయుడి చర్య లకు అద్దంపట్టాడు. (1857 మనం మరిచిన మహాయుద్ధం యం.వి.ఆర్‌ శాస్త్రి, పేజి.128.)

జనరల్‌ నీల్‌ సాగించిన ఈ మారణకాండలో సుమారు 10వేల మంది బలై ఉంటారని చరిత్రకారుల భోగట్టా. అత్యంత క్రూరంగా వ్యవహరించిన నీల్‌ చర్యలు చివరకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల అభిశంసనకు కూడ గురయ్యాయి. గ్రామాలకు గ్రామాలను అంతం చేస్తూ సాగిన నీల్‌ దుష్క్రత్యాలగురించి ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామ వార్తలను లండన్‌ టైమ్స్‌ పత్రికకు రిపోర్టు చేయడానికి ఇండియా వచ్చిన ఆంగ్లేయ పాత్రికేయుడు విలియం రస్సెల్‌ తన పత్రికకు పంపిన ఒక రిపోర్టులో ఆయన మధ్యలో ఎంతో మందిని ఉరితీశాడు. కాల్చివేశాడు. చివరకు మరో ఆంగ్లేయాధికారి నీల్‌తో మాట్లాడు తూ నీవు ఇలాగే కాల్చివేతలు, ఉరితీతలు సాగించినట్టయితే మున్ముందు ఆంగ్ల సైన్యంలో చేర్చుకో తగిన మగాడు మనకు ఇక్కడ దొరకడు అని అనాల్సి వచ్చింది అని రాశాడు.

(' Jayanthi se jude kuch sawal (Hindi)', Prof. Shamshul Islam, Janasatta Daily, New Delhi, 12 May 2007, P. 4)

ఈ దుష్క్రత్యంలో సుమారు రెండు వందల గ్రామాలను తగులబెట్టి వేలాదిగా ఆడ-మగ తేడాలేకుండా గ్రామస్తిలను ఆ మంటల్లో తోసి తగు లబెట్టిన దుస్సంఘ టనలను ప్రశ్నించిన గవర్నర్ జనరల్‌ కానింగ్ ఆ విధ్వంసానికి కారకుడైన జనరల్‌ నీల్‌ను తీవ్రంగా మందలించాడు. ఆతని అధికార హోదాను కూడ తగ్గించాడు. చివరకు అతని చర్య లను స్వయంగా, బహిరంగంగా ఖండించాల్సిందిగా కూడ నీల్‌ను కానింగ్ కోరాడు. ఆ విధంగా తన చర్యలను స్వయంగా ఖండించేందుకు ఏమాత్రం అంగీకరించకపోగా ఆ పని నేను చేయను, ఎన్నితిట్టనా పడతాను. కాని ప్రపంచం ముందు నా దేశాన్ని భయంకరంగా చిత్రించి అవమానపరిచే పని మాత్రం చేయను అని ఆంగ్లేయాధికారి జనరల్‌ నీల్‌ సమాధానమిచ్చాడు.

197