పుట:1857 ముస్లింలు.pdf/186

ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ-ముస్లింల ఐక్యత

The Mutiny of 1857: Heroism Amidst Contradictions‘, written by Cheryl Kanekar, Published in the magazine ‘ The Voice of People Awakening’ Feb. 1998 issue, P. 7)

ప్రదమ స్వాతంత్య్రసంగ్రామాన్ని ప్రారంభించింది, తిరుగుబాటుకు చోదకశక్తిగా నిలిచింది ప్రధానంగా ముస్లింలన్న దృఢ అభిప్రాయంతోనున్న ఆంగ్లేయ పాలకవర్గాలు, ప్రజానీకంలో మత విభేదాలను సృష్టించి, ప్రజల మధ్యనున్న స్నేహ సంబంధాలను విచ్ఛిన్నం చేసి, తమ మనుగడకు ఎటువంటి ముప్పు లేకుండాచూసుకోవాలనుకున్నాయి. స్వదేశీ పాలకుల తిరుగుబాటును దారుణంగా అణిచి వేసేందుకు కుయుక్తులు -కుట్రలకు పాల్పడ్డాయి.

గ్రామం లొగిలిలో పహారా కాస్తున్న సిపాయిలు

కుయుక్తులను చిత్తు చేసిన ఐక్యత

ఆ ఎత్తులలో భాగంగా భారత దేశంలోని ప్రధాన జనసముదాయమైన హిందువులను మభ్యపెట్టీ, ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని ఆంగ్లేయులు పథక రచన చేశారు. మతం ఆసరాతో విద్వేషం రెచ్చగొట్టి తద్వారా ప్రజలలో అనైక్యత సృషించాలని ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలలో భాగంగా ముస్లిం ప్రబువుల గతాన్ని తిరగదోడి వారికి వ్యతిరేకంగా అవాస్తవాలు సృష్టించి ప్రచారంలో పెట్టారు . ఆ సమయంతో ఉమ్మడి శత్రువును స్వంత గడ్డ మీద నుండి తరిమి వేయాలన్న ఏకైక లక్ష్యం తప్ప మరో అంతర్గత వైషమ్యాల ఆలోచన లేని ప్రజానీకం ఆంగేయుల దుష్ప్రచారాన్ని మరింత


183