పుట:1857 ముస్లింలు.pdf/168

ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

కూడా సలహా ఇస్తాడు. అ తర్వాత ముర్షద్‌ జాదా (రాజకుమారుడు) ఇంటి చుట్టూ కాపలా పెట్టమంటాడు. ఖాజీలను తొలగించి జడ్జీలను నియమించమంటాడు. వినకపోతే గవర్నరు జనరల్‌ నిజాంను పిలిపించి చెబుతాడు. అప్పటికీ వినకపోతే ఈ నిజాంను గద్దె దింపి, అతని కుటుంబంలోని మరొక వ్యక్తిని గద్దెమీద కూర్చోబెడతాడు. కాబట్టి జాగ్రత్త... అమీర్‌ షంషుల్‌ ఉమ్రా కూడ ఏమీ మ్లాడటం లేదు. తనకు ముప్పు వాటిల్లనంత వరకు అతను పట్టించుకోడు. వీరు భోగభాగ్యాలకు వశులైనారు. సర్పెఖాస్‌ పైన, జేబేఖాస్‌ పైన కూడ సాలార్‌ జంగ్ ఆధిపత్యం కావాలంటాడు. అన్నంలో విషం కలిపి పెట్టి నిజాంను చంపడానికి కూడ వెనుదీయడు. దేవిడిలోని దాసదాసీ జనం కూడ దివానుకు లోబడి వుంటారు.

ఈ పాపపు బుద్ధిని అల్లా పోగొట్టుగాక ! ఇస్లాం మతం మీద నిజాములకు విస్వాసం కలుగుగాక...ధాన్యం ధరలు తగ్గించమని నిజాం ఆజ్ఞాపించినప్పటికి దివాన్‌ పట్టించుకోలేదు. ప్రజలు బాధలు పడుతూ ఎన్నో విధాలా నలిగి పోతున్నారు. ప్రజలు చెలరేగే పరిస్థితులు అనతి కాలంలోనే ఏర్పడుతుంది. కాబట్టినిజాం మా వినతిని పాటించి బిరుదును త్వజించుగాక. (హైదారాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు, స్వాతంత్య్రోద్యమం చరిత్ర పరిశోధనా సంస్థ, హైదారాబాద్‌, 1984, పేజి.54-55)

ఈ ప్రకటన వల్ల బ్రిటిష్‌ వారంటే ప్రజలలో ఎంత నిరసన భావన ఉందో, బ్రిటిషు వారికి సహకరించే వారు ఎంత వారైనా విమర్శించడానికి ఎంతటి సాహసానికి తెగిస్తున్నారో అవగతమౌతుంది. ఈ రకమైన ప్రచారం, ప్రకటనలు ఆనాడు ప్రజలలో ఆంగ్లేయుల పట్ల ఉన్నచులకన భావం, ఆంగ్లేయుల వెంట సాగుతున్నసంస్థానాధీశుల పట్ల ఆగ్రహం స్థాయిని వెల్లడిస్తుంది. స్వదేశీయుల మీద ఆగ్రహం కలిగినా స్వదేశీ ప్రభువులను మాత్రం ఆంగ్లేయుల పెత్తనం నుండి విముక్తం కావాల్సిందిగా పదేపదే కోరుతూ సలహాలు ఇవ్వటం ద్వారా మాత్రమే తమ ఆకాంక్షలను వ్యక్తం చేయసాగారు.

ఆంగ్లేయుల నెయ్యం వీడమని నిజాంకు హితవు

ఆంగేయుల పట్ల అనుకూలత వ్యకం చేసున్ననిజాం నవాబును ఏవిధగానైనా దారి మళ్ళించాలని,బ్రిటిషర్ల పెత్తనం నుండి మాతృభూమికి విముక్తి కలిగించాలని పట్టుదలతో ఉన్న ప్రజలు నిజాం నవాబుకు నచ్చచెప్పాలనుకున్నారు. అయితే పిల్లి మెడలో

165