పుట:1857 ముస్లింలు.pdf/142

ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు




తొలినాటి తిరుగుబాటు ధ్వనులు

స్వాతంత్య్ర సంగ్రామంలో తెలుగు ప్రజల పాత్రను గమనించే ముందుగా ఆంధ్రప్రదేశ్‌గా ప్రస్తుతం పిలువబడుతున్న సర్కారు, రాయలసీమ, కోస్తా ఆంధ్రా, తెలంగాణాలు ఆనాడు ఎవరి ఏలుబడిలో ఉన్నాయో తెలుసుకోవాలి. పాలకులు, ఆ పాలకుల స్వభావం, పరిపాలనా వ్యవస్థలను బట్టి కూడ ఆయా ప్రాంతాల ప్రజల స్పందన- ప్రతి స్పందనలు ఉంటాయి కనుక రాజకీయ -భౌగోళిక అధ్యయనం అవసరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమైన తెలంగాణా, రాయలసీమ, కోస్తా ప్రాంతాలు ఆనాడు పూర్తిగా అటు బ్రిటిషర్ల పాలన

1806లో ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో స్వదేశీ సైనికులు తిరుగుబాటు చేసిన కోట

క్రింద గానీ లేవు. ఈ ప్రాంతాలు ప్రథమంలో నిజాం నవాబు ఆధీనంలో ఉన్నప్పటికీ, ఫ్రెంచివారి ప్రాపకం కోసం 1753లో కొంత ప్రాంతాన్ని, బ్రిటిషర్ల అండ దండల కోసం 1800 సంవత్సరంలో మరి కొంత భూభాగాన్ని నైజాం నవాబులు విదేశీ పాలకులకు ధారాదత్తం చేశారు. ఈ భూభాగాలను ఉత్తర సర్కారు, సీడెడ్‌ ప్రాంతాలుగా ఆనాడు పిలిచేవారు. 1800 నాటికి ఈ ధారాదాత్త ప్రక్రియ సమాప్తమైంది. ఆనాటి ఉత్తర సర్కారు, సీడెడ్‌ జిల్లాలు కలిసి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రప్రాంతం ఏర్పడింది. మిగిలిన ప్రాంతాలు నిజాం పాలకుల ఏలుబడి క్రింద ఉండిపోయాయి. ఈ

139