పుట:1857 ముస్లింలు.pdf/137

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను పోరుబాట నడిపించేందుకు కంకణం కట్టుకుని మరీ నిరంతరం అక్షరాగ్నులు కురిపించినందున ఈస్ట్‌ ఇండియా పాలకులు ఆ పత్రికల మీద, ఆ పత్రికల సంపాదకుల మీదా కక్షగట్టి మరీ వెంటాడారు. పత్రికలనునిషేధించటం, ప్రతికల ఆస్తులను జప్తు చేయటం, ప్రతికల కాపీలను దాహనం చేయటం, సంపాదకులను అరెస్టు చేసి చిత్రహింసల పాల్జేయటం నిత్యకృత్యమైంది.

ఈ విషపూరిత వాతావరణంలో పత్రికల మనుగడ కష్టతరమై పోవడంతో ప్రజల పక్షం వహించిన పత్రికలు క్రమంగా కనుమరుగయ్యాయి. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందు అనగా 1853 నాటికి 35 ఉర్దూ పత్రికలు ప్రచురితమౌతుండగా 1858 నాటికి అవికాస్తా 12 వరకు తగ్గిపోయాయంటే ఆయా పత్రికలు, ఆ పత్రికల సంపాదకుల పట్ల బ్రిటిష్‌ పాలకులు ఎంత క్రూరంగా వ్యవహరించారో తేలిగ్గానే ఊహించవచ్చు.

134