ఈ పుట ఆమోదించబడ్డది

దరిదాపు నూరు సంవత్సరముల క్రింద కృష్ణాజిల్లా యందలి మంగళగిరియను పురంబునందు తరిగొండ వెంకమ్మయను పేర బ్రసిద్ధురాలగు వొక కవయిత్రి రాజయోగసారము వేంకటాచల మాహత్య్మము నను గ్రంథ ద్వయంబు రచియించె. మొల్లియను నాబిడచే మొల్లి రామాయణము రచియింపబడె. ఈచొప్పున నాంధ్ర కవయిత్రులచే రచియింపబడిన గ్రంథములు విననయ్యెడు.

మద్గ్రంథసంభారమును పరిశీలించునపుడు మద్వంశ జాతయగు శ్రీ మదినె సుభద్రయ్యమ్మచే రచియింపబడిన కావ్యములు లిఖించియున్న తాళపత్ర పుస్తకము నాకు గానం బడియెను. ఈమె నా పితామహుని జేష్ఠ దుహిత- ఈమె 1781వ సంవత్సరమందు జనించె. ప్రిన్సిపల్ సదరమీగునా నుండి రాజకీయ కార్య నిర్వాహమునకుగా మునుమున్ను సీ. ఎస్. ఐ. అను బిరుదాంకమును శ్రీ శ్రీ శ్రీ మహారాణీగారి వలన బొందినవారిలో నొకరై ప్రసిద్ధికెక్కిన మదిన జగ్గారాయల వారికి తల్లి. ఈయన విఖ్యాతులైన యనేకులగు యూరోపియనుల పరిచయము గలిగి