పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/62

ఈ పుటను అచ్చుదిద్దలేదు
8]

53

కాళిదాస చరిత్ర

యెట్టకేలకు రామునిచేత మృతినొందెను. కాలము వచ్చినప్పుడు ప్రతి మనుష్యుడు సశించును. వాని నెవ్వరు రక్షింపజాలరు. చిన్నతనమందే నాకు గాలము తీఱియుండుటచే నేనిప్పుడు మృతినొందుచుంటిని. ఎవరికి జెప్పుట కేమున్నది? ప్రతిదినము ప్రాత:కాలసాయంకాలములయందు భగవంతుని బ్ర్రార్దించుకొమ్మని యొక ఢ్యానశ్లోకము జెప్పినది. ఆ శ్లోక మిప్పుడు పఠించి నేనొక్కసారి పరమేశ్వరుని బ్రార్దించుకొనియెద. ఇదియే నాకడపటి ప్రార్దనము గవున దానిని జేసికొనుటకు సెలవిమ్ము

శ్లో॥అంభోధి: స్దలతాం, స్దలం జలధితాం, ధూశీలన
     శైలతాం
     మేర్మత్కణాతృణం కులిశతాంవజ్రంతృణప్రాయతాం
     నహ్ని: శీతలతాంహేమందహనతా, మాయాతియ
     స్వేచ్చయా
     లీలాదుర్లలితాద్భుతన్యపనినే దేవాయ తస్ప్ర నమ
  

    తా॥ఎవ్వని యిచ్చచేత సముద్రము నేలయగునో పరమాణువులగుంపు పర్వతమగునో, మేరుశైలము మృత్కణ రూపమగునో, గడ్డిపోచ వజ్రాయుధమగునో , వజ్రాయుధము గడ్డిపోచయగునో, అగ్ని చల్లనగునో, మంచు మహాగ్నియగునో లీలాదుర్లలిత ప్రతిభుడగు నప్పరమేశ్వరునకు సమస్కరించుచున్నాడను.
    అని ప్రార్దించి యచ్చట నేలరాలియున్న మఱ్రి యాకులు రెంటిని దీసి దొన్నెగాజుట్టి  వత్సరాజు హస్తముననున్న ఖడ్గముతో దన పిక్కగొసికొని యా గాయమునుండి బొటబొటగారు క్రొనెత్తురు దొప్పలొ జేర్చి మఱియొక మఱ్ఱియాకు జేతగ్రహించి గట్టి గడ్డిపొచ రక్రములోముంచి యావటపత్రముమీద నొక శ్లోకము వాసి యీ మఱ్ఱియాకు మాపినతండ్రికిమ్మని యాతనిచేతికిచ్చి వెండియునిట్లనియె, "వత్సరాజా! ఏల యాలస్యము చేసెదవు? నీరాజునాజ్ఞ నీవు త్వరగా నిర్వర్తింపుము" అట్లుచేయుటచేత నీవు రాజ కార్యము చేసినవాడవేగాక నాకు మహోప