పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/27

ఈ పుటను అచ్చుదిద్దలేదు
18

కాళిదాస చరిత్ర

కిచ్చి వివాహము చేయుడు. దానితొ నాపద నివారణ మగును. అట్లుచేయకపోదువేని మీకు రాజ్యవిచ్చిత్తి గలుగు, వంశనాశనమగును" అనవుడు రాజు మిక్కిలి విచారించి, యెట్టకేలకొడంబడి, విద్యాగంధ: మెఱుగని యనాగరికుడగు మోటవాని డొకనిని దోడితెమ్మని సేవకులం బంపెను.

ఆహా! చూచితివా! దురాత్ముడైన యాగురువు బాలిక కెట్టి ఇక్కట్లు తెచ్చిపెట్టెనో! దుర్జనులు పాపభీతి కలిగియుండరు. చదువుకొనినంతమాత్రముచేత మనుష్యుడెప్పుడును బూజ్యుడుకాడు. చదువుకన్న సద్గుణమే ప్రధానము. సకలశాస్త్రవేత్తయైనను, గునవిహీనుడైన మనుష్యుడు వర్జింపదగినవాడే .శిరస్సున మాణిక్యము మాణిక్యముధరించియున్నను ద్రాచుపాము బరిత్యజింపదగినదేగాని ముద్దుపెట్టు కొన దగినదికాదుగదా!

సేవకులు నానాప్రదేశములు సంచరించి యెట్టకేలకు బ్రాహ్మణకిరాతుడున్న యడవికిబోయి వాడే తగినవాడని వానిని బ్రతిమాలి "నీకు మహావైభవము పట్టగలదు రారా!" యని వానిని దోడ్కొని పోయిరాజునకు గురువునకుజూపిరి. గురువు వానింజూసి "శిహబాస్ ! మాకిట్టివాడే కావలెనురా" యనిమెచ్చెను. రాజు వానింగనుంగొని కుసుమ కోమలియై బంగారుబొమ్మవలె నున్న తనకూతును, మానికంబును మసిపాతనుగట్టినట్లు విద్యావిహీనుడు, రూపవిహీనుడు, గుణవిహీనుడు నగు కటిక వానికిచ్చి వివాహముచేయవలసివచ్చి నందుకు విచారక్రాంత మనస్కుడై విధియోగముదాట శక్యముగదని గుండె ఱాయిజేసికొని కూతు నాతనికే యిచ్చి వివాహముచేయ నిశ్చయించి ముహూర్త నిర్ణయము జేయించి, విశేషవైభవము లేకుండ సామాన్య్హముగ వివాహకార్యము జరిగించెను. పితృ వాక్యపరిపాలనమే ప్రధానముగాగల యా బాలిక తండ్రి యానతిచొప్పున వానిని వివాహమాడెను.