పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/164

ఈ పుటను అచ్చుదిద్దలేదు

155

కాళిదాస చరిత్ర

వెనుకముందు జూడకుండ దానమిచ్చుటచేతనే కర్ణుని యొక్కయు బలిచక్రవర్తియొక్కయు, విక్రమార్కుని యొక్కయు కీర్తి యీలోకమున స్దిరమయియున్నది. మేము దానగుణ మెరుగకపోవుటచేత చిరకాలమునుండి సంపాదింపబడిన మా తేనె దానభోగ రహితమై నశించుచున్నది. ఇట్లు మీచేతులు పట్టుకొని, కాళ్లుబట్టుకొని యీ తేనెటీగ మీతో మనవిచేయుచున్నది.

   హృదయరంజకమయిన మాశ్లోకము విని సహృదయుడైన భోజమేదినీశ్వరుడు సంతోషించి మనుష్యుల మనోభావాలనేగాక, కాళిదాసుడు తిర్యగ్జంతువులయొక్కయు, కీటకనరీనృపముల యొక్కయు భావములసహితము గ్రహించగలశక్తి గలవాడయ్యెనని యానందించి వానికి విశేషమయిన బహుమానముచేసి యట్టికచి తన యాస్ధానమందుండి నందుల కానందించెను.

మ త్స్య ము లు

కాళిదాసునిమీద

నీర్ష్యగల పండితులు

రాజుగడకుబోయి యమ్మహాకవి సకలశాస్త్ర పండితుడయ్యు మత్స్య భక్షణ చేయుచున్నాడని పలుమాఱు రాజునిజేరి కొండెములుచెప్పిరి. రాజు కాళిదాసుంబిలిపించి యిందేమయిన సత్యమున్నదా యనియడిగెను. తాను మత్స్యభక్షకుడ కానని యతడు నిర్భయముగా రాజుతో మనవిచేసెను. రాజాతని మాటలయందు విశ్వాసముంచి ప్రత్యక్షముగా దన కన్నులతో దాను చూచినంగాని కాలిదాసునిపై వేయబడిన దోషారోపణలను నమ్ముటకు దనమనసొప్పదని భూధవుడు కవులతొజ్ చెప్పెను. రంధ్రాన్వేషణపరులైన యాపండితులు సమయము వచ్చినప్పుడు పట్టియిచ్చి యాకవిమీద రాజునకు ద్వేషము కలిగించుటకే ప్రయత్నముచేయుచుండిరి.