పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాళిదాస చరిత్ర

కాలనిర్ణయము

    శ్లో॥ధన్వంతరిక్షపణకామరసింహశంకు
         భేతాళభట్టఘటకర్పర కాళిదా.సా:,
         ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయాం
         రత్నాని వరరుచి ర్నవవిక్రమస్య.

అనియొక పురాతన శ్లోకముకలదు. దీని యర్ధ మేమనగా 1. ధన్వంతరి, 2. క్షపణకుఁడు, 3. అమరసింహుఁడు, 4. శంకుఁడు, 5. భేతాళభట్టు, 6. ఘటకర్పరుఁడు, 7. కాళిదాసు, 8. వరాహమిహిరుడు, 9. వరరుచి. ఈతొమ్మండుగురును విక్రమార్క మహారాజుయొక్క సభలో నవరత్నములని చెప్పఁబడుచు వచ్చిరి. ఇందు ధన్వంతరి వైధ్యశాస్త్ర పండితుడు. క్షపణకుఁడుఁ డేగ్రంథము రచియించెనో తెలియదు. అమరమని పేరుతో దేశమందంతట మిక్కిలి ప్రఖ్యాతిజెందిననామలింగానుశాసన మీయమరసింహుఁడు రచించినదే. శెంకుఁడెవరో తెలియదు. భేతాళభట్టు రచించిన గ్రంధములు కానఁబడవు. ఘటకర్పరుఁడుప్రాకృతభాషలోఁ గొన్ని గ్రంథములను రచించెనని