పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

హిందూకోడ్ బిల్ సమీక్ష

పురుషులకు గూడ ఏక పత్నీవ్రతము అత్యంత ప్రశంస నీయమే. అయినను భార్య మృతిబొందిన స్థితియందు సజీవు రాలైయున్న స్థితియందు గూడ పిచ్చిదయిన కారణము చేతను, సంతతి కలుగుకున్న కారణము చేతను, అగ్ని హూత్రాది కర్మలను, వంశమును నిలువబెట్టు కొనుటకై పురుషుడనేక వివాహములను జేసుకొన వచ్చునను విధానము శాస్త్రములందు స్పష్టీకరింపబడి యున్నది.

"పునర్దార క్రియాం కుర్యాత్పునరాధానమేవ చ"
                              (మను 5-168)

ఇట్టి యితిహాసములు గూడ బెక్కులు కలవు. పురుషులం దూహింపవీలు లేని సమత్వమును స్థాపింపనెంచు మనుజులు గర్భధారణ విషయమున గూడ బురుషులను బాధ్యులనుగ జేయవలసి యుండును. స్వరూ పముచేతను, అవయవములచేతను,యోగ్యతచేతను, శక్తిచేతను గూడ స్త్రీపురుషులలో భేదమున్న కారణముచే వారివారి కార్యములందు శాస్త్రము నిరూపించుచున్న భేదములనుగూడ స్వీకరించ వలసినదే. పురుషుడు తన ప్రకృతిచేత సంవత్సరమం దనేకమంది బిడ్డలను కనగలడు. స్త్రీతన ప్రకృతిజేత సంవత్సరమం దొక్క పర్యాయమే బిడ్డలను గనును. ఇట్టి స్థితియం దీసమత్వనాటక మంతయు నెందులకు? గర్భధారణము, శిశుపోషణమున నసాధారణశక్తి తల్లిదే. అనేక సంతానోత్పాదనశక్తి కేవల మొక్క పురుషునియందే యుండును. కనుక శాస్త్రాను