పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/90

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహము

81

సంబంధము, అధర్మజ సంతతి సంబంధము, దత్తక సంబంధము, రక్తజ సంబంధము, కూడ జేర్చబడినవి.

శాస్త్రీయ వివాహమున కేర్పరుపబడిన షరతులన్నియు ధర్మయుక్తములే యట. ఆలోచించి చూచిన నిది యంతయు గల్ల యని వ్యక్తము కాగలదు . ఆలోచించి చూడగ నిందలి మొదటి విషయమే పొరబాటుగ దోచుచున్నది.

సిద్ధాంత ప్రకారము స్త్రీ కొక్క వివాహమే యుక్తము. పతి యున్నను, మరణించినను స్త్రీ పునర్వివాహము చేసుకొన దగదు.

"నతు నామాపి గృహ్ణీయా త్పత్యా ప్రేతే పరస్య చ"
                                   (మను. 5-157)
"సకృదంశో నిపతతి సకృత్కన్యా ప్రదీయతే"
                                    (మను. 9-47)
                                   
"అయం ద్విజైర్హి విద్వద్భిః పశుధర్మో విగర్హితః
 మనుష్యాణామపి ప్రోక్తో వేనే రాజ్యం ప్రశాసతి"
                                   (మను. 9-66)
                                   
“న వివాహవిధావుక్తం విధవా వేదనం పునః."
                                   (మను. 9-65)

సావిత్రి మొదలగు వారే భయంకరాపత్తులో బడవలయునని యెఱింగియు మానసిక నిర్ణయమును మార్చుకొన లేదు గదా ! అట్టి స్థితిలో భర్త సజీవుడై యుండగనే యాతని విడచి స్త్రీ పునర్వివాహము చేసుకొనుటయనున దెంతయు నధర్మము కాదా ? ఇందు వేఱుగ జెప్పవలయు నదే మున్నది ?