పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

హిందూకోడ్ బిల్ సమీక్ష

నియమములను మాత్రము త్రోసిపుచ్చుట కెంతకాలము పట్టును? ఎంత కష్టము కలుగును? ధర్మము యెడను, ఈశ్వరునియెడను అన్యాయ మొనర్చినవారికి మంత్రులయొక్కయు, ప్రభుత్వముయొక్కయు కండ్లలో కారముచల్లుట ఒక లెక్క యగునా? పోలీసులు, సైన్యములు, సి. ఐ. డి. లు (గూఢ చారులు) ఆ విషయమున నేమియు చేయజాలరు. ప్రజలలో ధర్మబుద్ధి యడుగంటినపుడు పోలీసులు, సైనికులు మా మాత్రమే యాకాశమునుండియైన నూడిపడుదురా? వారు కూడ నా ప్రజలలో నుండి వచ్చువారే. వారుగూడ పూర్తిగ లంచగొండు లయిపోవుదురనుటకు సందేహము లేదు. అటిస్థితిలో చౌర్యము, లంచగొండితనము మున్నగున వెటు లంతరించును? ఒకసారి రఫీ అహమదు కిడవాయి మహాశయు దుపన్యశించుచు 'భ్రష్టాచారములను పోగొట్ట నియమింపబడినవారు కూడ భ్రష్టాచారముల పాలైపోయినారు' అని పల్కినాడు. ఇట్టి స్థితిలో హిందూకోడుద్వారా కమ్యూనిజము బాగుగ ప్రోత్స హిం చబడు నన్నమాట. ధర్మమునకు, సంవత్తునకు కౌటుంబిక జీవనమునకు కమ్యూనిజమందెట్లు తావు లేకుండ బోయినదో అట్లే దేశమందంతటను గూడ తావు లేకుండ బోవును. హిందూకోడుద్వారా సగోత్రవివాహము, అంతర్జాతీయ వివాహము, విడాకులచట్టము నాచరణలోనికి వచ్చిన తోడనే అధర్మప్రవృత్తు లధికమయిపోవును.

కోడుబిల్లు మున్ముందు శాస్త్రములమీద దాడిని సాగించును, కోడుబిల్లు స్వీకరించబడగానే మను, యాజ్ఞ