పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

49

పోరాడుటకు భార్యకు తగు అవకాశమును కల్పించునట. పాఠకమహాశయులారా ! హిందూకోడువారి న్యాయపద్ధతి ఇది. పైగా జిల్లా జడ్జి తరువాతను, హైకోర్టు తరువాతను కూడ అప్పీళ్లు జరుగుతునే యుండగలవు.

వివాహవిచ్ఛేద మయినతరువాత వీరిచే బిడ్డల సంరక్షణ నిమిత్తముగ జేయబడిన యేర్పాటంతయు వ్యర్థము బాలుర ధార్మిక గౌరవమును, నైతిక గౌరవమును నశింపు చేసిన తరువాత వారికి శిక్షణ యేమి జరుగును ? రక్షణ యేమి జరు గును? దత్తతయేర్పాట్లను శాస్త్రవిరుద్ధముగ జేసిపెట్టినారు కదా ! దత్తతకు హోమ మనవసరమనియే చెప్పినారు. కాని రిజిస్ట్రేషను మాత్రము ముఖ్యమని చెప్పినారు. ద్వ్యాముష్యాయణ దత్తకవిధానమున (సోదరు లిర్వురకు నొకని కుమారుడే కర్మాధికారి యగుట) నిషేధించి శాస్త్రము నావలద్రోసి పెట్టినారు. ద్వ్యాముష్యాయణాది దత్తతవిధానములు శాస్త్ర సమ్మతము లయినపుడు వాటి నంతరింపజేయుట యనధికార ప్రయత్నము కాదా! కనుకనే బిల్లు వారు “ఈపద్ధతిని బట్టి దత్తత చేసుకొనుటవలన సంపత్తు రెండు కుటుంబములను దాటి యావలకు బోకుండయుండును. ఒకే వ్యక్తిగాని, కొందఱు వ్యక్తులుగాని సంపత్తును తమ చేతులలో నణచి పెట్టుకొని కూర్చొనకుండుటకై ప్రభుత్వమేదియో యొక యేర్పాటు చేయవలసియున్నదికదా! అట్టిస్థితిలో ద్వ్యాముష్యాయణాది విధానముల నెటులుంచగలము? ఈవిధానములను బట్టి రెండు కుటుంబములవారు కేవలము సంపదను