పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

హిందూకోడ్ బిల్ సమీక్ష

చిన స్త్రీపురుషుల నైనను అన్యాయులని చెప్పుటెంతయు నన్యాయము. శాస్త్రము లందఱకు హితమును గోరునవి. వాటి నియమములకు లోబడి యుండుటయందే శ్రేయ మున్నది. సమాజమందలి చాలమంది స్త్రీపురుషులు వాటిని పాటించుటయందే యధిక గౌరవమును భావింతురు. అట్టిస్థితి యందే కొలదిజనుల యాలోచలను బట్టియో శాస్త్రమర్యాదల నుల్లంఘించుట మంచిపని కాదు. జలమువలె మానవు న కు నిమ్న ప్రదేశములలో బ్రవహించుట స్వభావము.

ఒక నియంత్రణము లేనిచో నా ప్రవహించుటంతయు వ్యర్థమగును, హానికరమగును. ఆ నియంత్రణముకూడ వేద ముల యొక్కయు, దూరమును జూడగల మహర్షుల యొక్కయు విధానముల నియంత్రణమే మేలైనది. 'కర్తవ్య నిష్ఠముందు అధికారవాంఛ లెక్కింపబడదగినది కాదు' అను విషయము నందఱు సమ్మతింతురు, సతీత్వము, వైధవ్య పాలనము, తపస్సు, మాతృత్వము, ఆదర్శపత్నీత్వము వలన గలుగు గౌరవము సర్వోత్కృష్టమైనది. వీటిని బాటించుటచే శక్తిసామర్థ్యములు తగ్గవు. దినదిన ప్రవర్థమానములు కాగలవు. వీటి మహిమమూలముగ భారతనారి ప్రపంచమందలి స్త్రీలందఱియందు నాదర్శకారిగ బరిగణింపబడుచు వచ్చుచున్నది.. ధనసంపదలనే కాదు. ఆమే దేవతలను కూడ వశమొనర్చు కొన గలదు. కాలమును కూడ ధిక్కరించగలదు. పతి పుత్రా దులను మృత్యుముఖమునుండి బయటకు గొని రాగలదు. ఈవిషయములతోడ స్త్రీకి సంబంధము లేకుండ జేయగోరు