పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

హిందూకోడ్ బిల్ సమీక్ష

శాసింపబడువారు నేడు హిందువులని యెట్లు చెప్పబడుదురు! అనగా నిచట నన్యోన్యాశ్రయ దోషము కూడ పట్టినదన్నమాట. హిందూశబ్ద పరిభాష నిశ్చితమయితే హిందూకోడును నిశ్చితమగును? హిందూకోడు నిశ్చితమయిన తద్వారా శాసింపబడువాడు హిందువు డనబడును. వాస్తవమున జాతివర్ణములతో నిమిత్తము లేక బెండ్లి చేసుకొనగోరువారు "స్పెషలు మేరేజి యాక్టు" ప్రకారము తా మహిందువులమని చెప్పుకొనవలసియుండును. అట్లు చెప్పుకొన నక్కఱయు లేకుండవలె. హిందువులైయుండి స్వేచ్ఛాచరణమునకు నుద్యతులు కావలె. - నిదియే యీ బిల్లు యొక్క యుద్దేశ్యము. కనుకనే పై యాక్టు ప్రకారము పెండ్లి చేసుకొన్న వారు కూడ హిందూకోడు చేతనే శాసింపబడుదురు ' అని కూడ చెప్పబడినది హిందూకోడు పేసయిన పిమ్మట దీనిద్వారానే అట్లు చేయుట కవకాశ మీయబడగలదు. అందుచేతనే బుద్ధిమంతులగు జను లీబిల్లు ద్వారా వేశ్యాస్త్రీని పరమసాధ్వీలలామ యగు గులీన స్త్రీతో సమానముగ నుంతుమని చెప్పుచున్నారు. ఈకోడులో చెప్పబడిన పరిభాష ప్రకారము ఏ విజాతీయుడైనను కన్యాలోభము చేత గాని, ధనలోభముచేత గాని నిమిషములలోపల హిందూ ధర్మము నవలంబించి తన మనోరథ మీడేర్చుకొని తన మొదటి మతములోనికి తిరిగి పోవచ్చును. ఇందు దీని కభ్యంతరమేమియు లేదు. ఇట్లు ఇతర మతస్థులకు హిందువులమీద దాడి చేయుట కవకాశము చిక్కును. హిందూకోడుబిల్లును