పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

21

లయ్యు నవి యిందెచటను జర్చింపబడలేదు. కొంత ముందునకుబోయి బౌద్ధ, జైన, సిక్కు ధర్మముల నవలంబించువారు కూడ హిందువులే యని పరిగణించిరి. ఇది లక్షణవైరూప్య మన్నమాట, ఒకమారు హిందూ ధర్మానుయాయిని హిందు వనినారు. రెండవమారు సిక్కు, జైన, బౌద్ధ మతస్థులు కూడ హిందువులే అని యనినారు. సిక్కు మున్నగు 'మతస్థులు హిందువులని చెప్పబడినప్పుడు హిందూధర్మానుయాయిని సిక్కు మున్నగు మతస్థులుగా నేల బరిగణింపకూడదు? ఒకడు అన్యమతము నవలంబించినంత మాత్రమున నామతానుసారముగ నన్యశబ్దముచే వ్యవహరింపబడు చున్నాడు గదా! అట్టియెడ మహమ్మదీయ క్రైస్తవులు మాత్రము హిందూ పదవాచ్యు లేల కారు ? అట్టియెడ "హిందుస్తానీకోడుబిల్లు" అనుట చాలమంచిది. 'హిందూ' శబ్దమును ప్రయోగించి ప్రభుత్వము ఈ సాంప్రదాయకత్వపు పంకమున నేల జిక్కు కొనవలయును ?

ఉచితుడు, ననుచితుడు నెట్టివాడయ్యు నేబాలకుని తల్లిదండ్రులలో నొకరు హిందువులైయుందురో యాబాలకుడు కూడ హిందూశబ్దవాచ్యుడని చెప్పినారు. ఇది యొక విచిత్ర భాష తల్లి హిందువయిన మాత్రమున నాపె బాలకుడు కూడ హిందువు డనబడదగు ననినారు గదా ! తండ్రి యన్య జాతీయుడయిన నాతని బాలుడు కూడ నన్యజాతీయుడని యేల చెప్పబడ కూడదు? వాస్తవమున జాతియొక్క లెక్క యే లేదందురా? దానికి తావేల నియబడుచున్నది. ఏవస్తువున