అంజయ్య - రాజమండ్రీ వెళ్ళేమేలు వస్తోందొస్తోంది!
చెంచు - (రాజమండ్రీవేసు చూస్తూ) ఏదీ కనపడదేం?
అం - ఆవేపుచూసి లేదంటావేమిటయ్యా, నువ్వెప్పుడూ రైలెక్కనట్టు కనబడుతుంది!
చెం - నేనుమాత్రం ఎక్కినట్టు చెప్పానా ఏమిటీ! రాజమండ్రీ మేలూ అంటే రాజమండ్రీలో బయల్దేరి ఇక్కడి కొచ్చి నన్ను తీసుగు వెడుతుందేమో అనుకున్నాను.
81
కొడుకు - నాన్నా ; పుస్తకాలన్నీ కొన్నానయ్యా, ఇంక డిక్షన్రీ ఓటి కొనాలి, రొండున్నరా.
తండ్రి - అదంటే ఏమిట్రా, చవటా?
కొ - అర్థాలూ అవీ ఉంటాయి నాన్నా!
తం - ఓరి నీ మోహం ఈడ్చా! అమరమామిటీ?
కొ - కాదు నాన్నా, ఇంగ్లీషుది.
తం - ఏడిశావులే అప్పిడేను. ముందు, కొన్నవన్నీ చదివి ఏడుద్దూ అదీ కొనితగలేద్దుగానీ!
82
అప్పుడు - రైలుకి టెక్కెంటెంతేటి బాబు?
గుమాస్తా - ఏడిసినట్టే ఉంది. ఏవూరికి?
అ - ఎక్కడికైతేంబాబు! నాయిట్టం!
గు - అది కొన్న తరవాత.
అ - అయితే యిజానారం బాబు!
83
ఒక టీపార్టీ జరిగే సందర్భంలో అశ్లీలపుమాటలంటే చెవికోసుగునే లక్ష్మణయ్యగారు టీలోకి తనకి కొంచెంపాలు ఎక్కువ కావలసి, యజమానితో,
ల - అయ్యా! ఆ ఆవుని కాస్త ఇల్లా వెనకాడించి తరుముకురండి!
అనగా, యజమానురాలికి ఎల్లానో అనిపించి, పాలువడ్డించే దానితో,
యజమానురాలు - దూడ అరిచేచోటికి వెళ్ళమ్మా త్వరగా! -
84
రావు - నిన్న కలెక్టరు షేక్ హాండు ఇచ్చాడండీ
శాస్త్రి - ఏమి అదృష్టమండీ? మీకే?
రా - అబ్బే, నాకు కాదండి. ఒక గొప్పాయనికి.
శా - సరి. ఆమాటెందుకిప్పుడూ?
రా - అందుకనికాదూ. మొదట నాకే ఇద్దాం అనుకున్నాడులెండి.
శా - ఏం?
రా - ఆయనేమో అనుకుని.
85
కొందరు బియ్యే విద్యార్థులు భోజనం దగ్గర కూర్చుని ఉండగా,
సుబ్బు - పంకజం! నువ్వెన్ని బూర్లు తినగలవ్?
పం - రెండు మూడూ! ఊహూ ఆబేగాని తీపి మొహం మొత్తిపోతుంది.
సు - నువ్వురా, చంద్రయ్య! |
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
19
హాస్యవల్లరి