పుట:హాస్యవల్లరి.pdf/101

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93

కూతురు, జారిపడిపోగా,

రక్ష్మమ్మ - నీచావు నేలబడ!

అంటూసాధిస్తూ వేళ్ళు అంటుగునేటట్టు వీపుమీద బాధగా, ఇంటికొచ్చిన వియ్యంకుడు. అదేమిటక్కో! చంటి పిల్లని అల్లా చావగొట్టేశారే!

ల - మరి కిందికి దిగజారి చచ్చిందాయిరి, ఎంజెయ్యను చావనా!

వి - ఒహోహో! అల్లాయితే, మీరు ఆ చచ్చిన దాన్ని, చచ్చిచెడి బతక్కొట్టేశారన్నమాట! ఈ మాటు బోధపడ్డది!

94

శంభన్న - ఏమండి! రామకోటిగారుఁ భుజంమీద ఏమిటాకట్టు!

రా - విన్లే? మొన్న మావాళ్ళింటో పెళ్ళుమంటూ జరిగిన పెళ్ళి ఊరేగింపులో అవుటు పేలినప్పుడు తగిలినదెబ్బ!

అన్నట్టు మీ అమ్మాయికి ఎక్కడేనా ముడెట్టేశావా!

శం - ఆ అందుకనే రాకపోతా! ఆ రాత్రే గుళ్ళో అయింది,

రా - గుళ్ళో ఎందుకు మళ్ళీనూ! అదే ఇంట్లో కానీక పోయావా!

రా - గుళ్ళో అయితే అధమం దేవుడేనా రాయల్లా మాట్టాడక ఊరుకుంటాడుగదా, ఎక్కడికక్కడితె, అని!

95

వెంకన్న - కిష్టిగా! నీచేష్టలు ఊరేగించా! ఇల్లారా!

కి - (వచ్చి) ఏం?

వెం - సరేగాని మొహం అటు తిప్పిమాట్లాడు.

కి - ఎందుకూ?

వెం - ఎందుకా! నీమొహం చూస్తే అన్నమేనా పుట్టదు.

కి - పుట్టకపోతే అంబలితాగి నవ్యశ్రీనాథుడివి అయిపోదుగానిలే. కాని, నీ మొహం నాకేసే పెట్టు!

వెం - ఎందుకూ?

కి - అది చూస్తేగాని డోకే రాదు.

96

ఒక నాటకం ఆడడం సందర్భంలో, బ్రహ్మ సరస్వతులు కూచునిఉన్న ఒకరంగంలో, ఒకపాత్ర గబగబావచ్చి బ్రహ్మని శరణుజొచ్చి వరం వేడుకోగా, బ్రహ్మపాత్రవాడు తను ఏంజెయ్యాలో మరిచిపోయి ఊరుకోగా, ప్రాంప్టింగు ఇచ్చేవాడు బ్రహ్మతో సన్న సన్నంగా, - దేవి, దేవీ..............

అని అందివ్వగా, బ్రహ్మపాత్రధారి వినిపించుకోకపోగా,

ప్రాం - ఆగంతుకులు వేషా లేస్తే మా ప్రాణంమీదికి తెస్తారు. (అంటూ సణుక్కుంటూ అక్కణ్ణించి కదిలి స్టేజి మేనేజరు దగ్గరికి వెళ్ళి) అయ్యా! అయ్యా! మీ బలవంతం మూలాన్ని వేశానని అతనంటాడు. ఇప్పుడు చేస్తే వినపించుగోడాయిరి అసందర్భం జరిగితే మీరు చంపుతారు. సీను ఆగిపోతోంది. ఏమిటి గతి? -

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

91

హాస్యవల్లరి