ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 3.

301

క. సరసము లగునుచితవచో, విరచనములఁ దెరువునందు వెలఁదిఁ బ్రణయసుం
     దరుఁ డయి మఱియును దేర్చుచు, నరిగెఁ బురికిఁ బ్రమదనిర్భరాత్మకుఁ డగుచున్.152
వ. యాదవులును మగధరాజప్రముఖుల జయించి రామసాత్యకుల మున్నిడికొని
     యార్పులు పెడబొబ్బలు విజయతూర్యంబులమ్రోఁతలు నొక్కటి యై యెదు
     ర్కొను పౌరుల హర్ష సంకలితనినాదంబులతో నెదుర్కొని కలయం బురప్రవేశం
     బొనర్చి రట కైటభారి గడచిపోయిన యనంతరంబ శ్రుతపర్వుండు రుక్మిం దన
     యరదంబుపై నిడికొని చనియె నతండును రుక్మిణిం గ్రమ్మఱింపక కుండినపురంబు
     సొర నని ప్రతిన చేసినవాఁడు గావున నట్లు భగ్నప్రతిజ్ఞుం డగుటం దనపేర భోజ
     కటకం బను నగరంబు గావించి యందు వసియించె మగధపతియును మూర్ఛదేఱి
     చెదరిన సైన్యంబులం గూర్చుకొని విదర్భకటకవాసులచేత నగవులకుం బాలైన
     శిశుపాలుం దోడ్కొని తనదేశంబునకుం బోయె నంత నక్కడ.153
చ. యదుకులవృద్ధు లందఱును నానకదుందుభి లోనుఁగాఁ బ్రియం
     బొదవఁగ శౌరి పెండ్లికి ముహూర్తము మేలుగఁ బెట్టి చుట్టపుం
     బదువును దక్కునుం గలుగుపార్థివకోటినిఁ బిల్వఁ బంచి యొ
     ప్పిదము లొనర్పఁ బంచిరి గభీరవిభూతి యెలర్ప వీటికిన్.154
వ. ఇట్లు పనుచుటయు రాచనగరునను నగరంబునందును.155
సీ. మణికుడ్యములు కుంకుమంబునఁ జెలువొందఁ దొడసిరి మెఱుఁగులు దుఱఁగలింపఁ
     గాంచనస్తంభము ల్గవుసెనల్ పుచ్చి [1]రింపారుశిల్పము లెల్ల నచ్చుపడఁగ
     మృదులకుట్టిమముల మృగమదసలిలంబు [2]లలికిరి చూడ్కులు నొలసి జాఱ
     ముక్తాఫలంబుల మ్రుగ్గులు పెట్టిరి పలుదెఱంగులరచనలు దలిర్పఁ
తే. గ్రముకకదళికాకమనీయకాండసమితిఁ, జేర్చే యభినవాశ్వద్ధవిచిత్రచూత
     పల్లవంబులఁ దోరణప్రతతు లమరఁ, గట్టియెత్తిరి చీనాంశుకధ్వజములు.156
మ. అతులైశ్వర్యసమేతు లై వెలయుసౌహార్దంబునన్ బంధుభూ
     [3]పతు లుద్దామరథద్విపాశ్వములతో భవ్యోజ్జ్వలాలంకృతుల్
     వితతశ్రీలఁ దలిర్ప వచ్చిరి మహావీరుం ద్రిలోకార్చ్యు న
     చ్యుతుఁ గల్యాణవిధానవేళఁ బ్రియముల్ సొంపార నర్చింపగన్.157
క. మును లేతెంచిరి చిత్తము, లనురాగరసాబ్ధి నోలలాడఁగఁ దపముల్
     గనియంగఁబండెఁ దమకని, యనుపమభద్రు, బలభద్రుననుజునిఁ జూడన్.158
తే. వసుధఁ గలవిప్రభూవరవైశ్యశూద్ర, వర్ణముఖ్యులుఁ దక్కినవారు నర్థి
     నరుగుదెంచిరి హరివివాహాభిజాత, మంగళం బనుమోదింప మనము లలరి.159

  1. యరుదారుశిల్పంబు లచ్చుపడఁగ
  2. లరివిచూడ్కులమించు లొలసి జార
  3. పతులుం దాము