ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

హరివంశము


యెత్తువడి తెవులుగొంట్లు ముదుసళ్లును మడియ బలవంతంబు లైనవియుఁ జేవ
దక్కియుఁ బసులు పెక్కు బాధలం దల్లడిల్లఁ బశుపాలురును [1]గుడిసెలు గూలి
బండ్లు (దడఁబడం) దూలి సొమ్ములు శిధిలపడి పాకాదిక్రియలు మాలి దోహనం
బులు నిలిచి మహాక్లేశంబునఁ గొందలంబునొంద నందఱుఁ గృష్ణ కృష్ణ కావుము
గోవులకు మాకును దిక్కు నీవ యని యాక్రోశింప గోవు లున్ముఖంబు లై యఱ
చుచు శరణంబు వేఁడువిధంబునం దనవలనిక పఱతేర నవ్విధం బంతయు నాలో
కించి వాసుదేవుం డాత్మగతంబున.

171


మ.

తనకై చేయుమహోత్సవంబు నటు లేఁ దప్పించుటం గోప మె
క్కినచిత్తంబున గోవ్రజంబున కతిక్లేశంబు పుట్టింప నె
ట్టన నయ్యింద్రుఁ డొనర్చి నట్టిదురవష్టంభంబు గా కేమి యి
వ్వినిరోధం బతఁ డింతఁ దాఁ గనునొకో విద్వేషసాఫల్యమున్.

172


క.

దీన ననుఁ జిక్కు వడియెడు, వానింగాఁ దలఁచె నిపుడు వాసవునట్ల
జ్ఞాని యొరుఁ డెవ్వఁ డింతయు, మానింపఁగ నేరనేని మఱి నగనిమ్మా.

173


శా.

ఈగోవర్ధనశైలముం బెఱికి [2]నే నింపొందఁ గేలన్ వియ
ద్భాగం బందఁగ నెత్తి మందిరముచందం బొందఁగాఁ జేసి యే
నీ గోసంతతి నెల్లఁ గాచెద మదీయైకత్వసత్వోదయ
ప్రాగల్భ్యంబులు సర్వలోకవినుతిప్రాప్తిం గనుంగావుతన్.

174

శ్రీకృష్ణుఁడు గోరక్షణార్థంబు గోవర్ధనపర్వతంబు నెత్తుట

వ.

అని తలపోసి నిశ్చయించి యాక్షణంబ.

175


మ.

వనమాతంగము విస్ఫురన్మదకళావష్టంభశుంభద్దశన్
సునిరూఢం బగుక్రీడఁ బంకజము నున్మూలించుచందంబునన్
వనజాక్షుం డవలీలమైఁ బెఱికి సన్నద్ధాగ్రహస్తంబునం
గొని యెత్తెన్ విపులాతపత్రసమతన్ గోవర్ధనాద్రీంద్రమున్.

176


సీ.

కదలి డొల్లెడు మహాగండశైలములతో నిలమ్రాకులును బెల్లగిలిపడంగ
వడిఁ దూలి చెదరెడువారివాహములతో ఘనమృగవ్రజములుఁ గలఁగిపాఱ
నుదరి క్రేళ్లుఱికెడునుగ్రకేసరులతో బిలగతాహులఁ గింక వెలికి నెగయ
వెసఁ బాసి పోయెడు విద్యాధరు తోడ నియమస్థమునిజనాళియుఁ దొలంగ


తే.

నొత్తువడి కాంచనాదిధాతూచ్చయములు, రసము జొబ్బిలఁగా రత్నరాసు లొలుక
నడరిసానుసంధులు వ్రయ్య నమ్మహాద్రిఁ, గలయ నాభీల మయ్యెఁ దచ్చలనవేళ.

177


చ.

గొడుగుగఁ జేసె గోవులకు గోపకుమారులకు న్నగంబు ని
ట్లొడఁబడవచ్చుఁ బొ మ్మనఁగ నొప్పెడు వ్రేళులు వంజ[3]మాడ్కియై

  1. గుడుసలు
  2. నేనీ ప్రొద్దె కేలన్
  3. పంజు