ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

హరివంశము


శా.

నీపార్శ్వంబుల నెప్పుడుం దగిలి సన్నేహాత్ములై యాడునీ
గోపాలు ర్గడుపుణ్యకృత్తులు భవద్గోపాలనైకాస్పదం
బై పాటింపఁగ నొప్పునివ్వనము భవ్యం బవ్యయానంద యీ
గోపఙ్క్తుల్ భవదీయఖేలనకళాగుప్తుల్ [1]కృతాధ్యాత్మికల్.

200


సీ.

నినుఁ దనూభవునిఁగాఁ గనినయాదవుఁడును భోజకన్యయుఁ గులభూషణములు
మాతాపితృత్వాభిమానులై నీదెసఁ [2]గరఁగు గోపుఁడు గోపికయు [3]సుకృతులు
నీకు నుత్తంసమై నెఱసినయాబర్హి బర్హదామము లోకపావనంబు
నీకేలఁ దగిలి శ్రీనిత్యమై తనరు నివ్వేణువు త్రైలోక్యవినుతిపదము


తే.

నీయురంబునఁ గ్రాలునిన్ని బిడవిపిన
పుష్పమాలిక కృతకృత్య భువనవంద్య
వేయు నేఁటికి మము నీవు విశ్వరూప
నేఁటినుండి నీవారిఁగా నెమ్మిఁ జూడు.

201


క.

అని పలికి తాపసోత్తము, లనుకంపాస్తిమితచిత్తుఁ డై నవ్వుచు న
వ్వనజాతుఁడు తమునర్థిం, గనుఁగొన [4]వీడుకొని చనిరి కామితసరణిన్.

202


వ.

అని వైశంపాయనసంకీర్తనంబు లైనకృష్ణపంక్రీడనంబు లసంక్లిష్టవిస్పష్టంబు
లగు వాక్యంబులం గ్రమంబున.

203


ఉ.

త్యాజితశత్రుగర్వ వసుయాజితభూమిసుపర్వ నిత్యసం
యోజితసత్యధర్మ వినయోర్జితశర్మ సమిద్ధవైభవ
భ్రాజితభవ్యగేహ యపరాజితబాహ యశశ్శశాంకనీ
రాజితలోకమండల విరాజితధీస్థితనాకమండలా.

204


క.

[5]అమరభరణనారాయణ, యమలచరిత్రైక[6]రుచిపరాయణ[7]శ్రవణ
శ్రమశీలిత నారాయణ, సమదమహోద్దామసైన్య సంతతధన్యా.

205


మాలిని.

దమితవిమతగర్వా దారితారాతిదుర్గా
శ్రమితవినుతకీర్తీ ప్రాజ్ఞచేతోనువర్తీ
రమితయువతిచిత్తా రక్షితానాదివృత్తా
శమితసకలదోషా సౌమ్యసంపాదివేషా.

206


గద్యము.

ఇది శ్రీ శంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయ
నామధేయప్రణీతం బయిన హరివంశంబునం బూర్వభాగంబునందు షష్ఠా
శ్వాసము.

  1. కృతార్థాత్మకుల్ (పూ. ము.)
  2. గల్గు
  3. నుసురులు
  4. వీడ్కొలుపఁజనిరి
  5. మిత
  6. నుతి
  7. పటువిక్రమ