ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

హరివంశము


బుల విహితశయన లై సుఖియించు కదుపులలోనఁ [1]బేరుపేరం బిలువం బంచి
తిల్లుచు నుల్లసితహుంకారంబు లగువదనంబులతో నున్ముఖలగు తల్లులకు నభిముఖం
బు లై హర్షప్రతినినదంబులు వొదలం బొదులనుండి యొండొంటి [2]దాఁటుకొని
కలయు బాలవత్సంబుల [3]యుత్సవసంచారంబులవలనను వెదయావుల వెనుకం దగిలి
యొండొంటిం జేరనీక బలియు [4]ఱంకెలం బొదివి కాలు ద్రవ్వి క్రోడాడుచుఁ బొగరు
మిగిలి [5]కఱకెక్కిన మెడలును వలుదమూఁపురంబులును వెడఁదవీఁపులును దోరంపు
గంగడోళ్లునునై క్రాలువృషభంబుల దర్పవికారంబువలనను మొదవులనోరినురువు
లుం బెయ్యలరేణంబులుం బాలకుండలమసులునుం దమయొడళులకు [6]నెడపడని
తొడవులు గాఁ బిదికి యురుద్రాళ్లు[7]ం దలుగులు తల మొలలం జుట్టి యిట్టునట్టునుం
గలయం బాఱి క్రేపుల నేర్పఱించువారును వల్లియలు వైచి కోడెలం బట్టి పెనఁచి
[8]కాలురులం బట్టి జట్టికాండ్రకు వసంబు సేయు బరవసం బెసంగఁ గ్రుమ్మరువారును
జూఁడుఁ గొడుపులును వాదోళ్లు ముకుబంతులు మొదలుగాఁ గలసాధనంబులు
గొనివచ్చి తేవులుగొంటులఁ జికిత్సంచువారును గ్రేపులం గొననియావులం దొలఁగం
గట్టి పిళ్లువెట్టియు మందులుసల్లియుం జాలదుఃఖపఱచి చేఁ పెఱుంగించువారును
మఱియుఁ బెక్కువిధంబులఁ దమతమకై యెడపడని కావటిమోపులకతనం గంది
కాయలు గాచి వంగినవలుదమూఁపులును ముదుకవెన్ను [9]లంటికొనుట మెదుక
గొని మొదుకనయి పిడిచినం బొల[10]వలచుచుండుతలలును బసులకొమ్ముల [11]తాఁ
కుల నడవిక్రంప [12]యేట్లమన్నియమ్రుచ్చుల పోట్ల బెరసిన గంట్లం గఱకెక్కినయవ
యవంబులు నెఱ్ఱసెరలతోడి కపిలకన్నుల వెడంగుఁజూపులును బెడిదంబు లగు
[13]గౌరుటెలుంగులుం గలిగి యెల్లయెడలనుం ద్రుళ్లు గొల్లలపెల్లువలనను జను
కట్టులుగట్టి భుజమూలంబుల జిగిసొంపు [14]లం గలసి మెఱసి నెఱయం జిలుమూరు
నిత్తడికడియంబులుం గంచుటుంగరములు నమరం గొమరారు నాఁచుదీఁగలు
గలయం బ్రాఁకినం బొలుచు కెందామరలం దెగడుచేతులం గడవలవాతులు
పదిలంబులుగా [15]15 నూఁది చెదరిన చికిచికివెండ్రుకలు [16]పొదుపుటం జిఱు మొగులు
మొలకలు బలసినకొఱనెలలకుం బాటియగు నెన్నుదురుల నున్నచెమరులు దురం
గలింప గరువంపుడప్పి యొప్పు నిదురయూర్పులుం దమలో [17]బెరసి యాడుమాటల
తమకంబున నినుమడి యై నిగుడ వడవడవడంకుచున్న [18]చన్నుగవలును వ్రేఁగు
పడు పిఱుందులుం బొలయు చూడ్కులు నై యొక్కొక్కతోయంబునంగూడి
సరిత్తోయంబులం దెచ్చు జలవాహికలును గాంచనకంకణఝణఝణత్కారంబులం

  1. బేర్వేరన్
  2. దాటుగొని
  3. యుపవన
  4. రనదల నందంద తోలి
  5. కరుకెక్కిన
  6. నేరని
  7. రులుం బలుపులునుం దల
  8. కాలుర్లంజుట్టికారుకు, కారూళ్లజట్టికారులకు (పూ. ము.)
  9. వన్నె
  10. వలచుజుంచుదల
  11. త్రాఁకుల
  12. లంట్ల
  13. కారెలుంగులు
  14. లంకిలి
  15. బూదె చఱచి
  16. లొదవు
  17. నిముచ్చట
  18. వెడంద