ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరివంశము

112


వలయు ననిన భూదేవివాక్యంబులకుఁ దత్సభాసదు లందఱుఁ దమలో విచా
రించి నిశ్చయించి విరించి కిట్లనిరి.

34


క.

ఈ దేవి యిట్లు దుఃఖిత, యై దూఱుఁగ నూరకుండ నగునే [1]మన కీ
వాదిభవుండవు భువన, ప్రాదుర్భావంబు నీకుఁ బని యట్లగుటన్.

35


సీ.

వాసుదేవుఁడు మహేశ్వరుఁడు విశాఖుఁడు వాసవుం డంబుధీశ్వరుఁడు యముఁడు
ధనదుండు చంద్రుండు తపసుండు పవమానుఁ డనలుండు సురమంత్రి యసురగురుఁడు
విశ్వులు రుద్రు లశ్వినులు సాధ్యులు యక్షగంధర్వరాక్షసగరుడభుజగ
కిన్నరప్రముఖులు గిరిసరిజ్జలధులు ననఁ బేరుకొన్న వీరంతపట్టు


తే.

వారుఁ దమతమయంశముల్ వసుధమీఁద, [2]నతులభూసురక్షత్రియాన్వయములందు
యోనిజులు నయోనిజులు గా నుద్భవింపఁ, జేసి భారావతరణంబు సేయవలయు.

36


క.

నావుడు మేలగు నిట్టులు, గావించుట లెస్స యని తగం బలికి జగ
ద్భావనుఁడు పద్మభవుఁడు సు, రావళితో మఱియు నిట్టు లనియెం బ్రీతిన్.

37

బ్రహ్మనిదేశంబున సముద్రుండు శంతనుం డై పుట్టినప్రకారము

క.

విను మేను తొల్లి సాయం, తనసమయమునందు వనధితటమునఁ బ్రజ్ఞా
ఘనుఁ డగుకశ్యపమునితో, ననుపమతత్త్వార్థగోష్ఠి నాసక్తుఁడ నై.

38


సీ.

ఉన్నంతఁ జంద్రోదయోద్దామదర్పుఁడై యాసరిద్విభుఁడు గంగాసమాగ
మంబునఁ బొంగారి యంబరచుంబిచంచద్వీచితతితోడ సరభసముగ
నేతెంచి మాయున్నయెడ నిండఁ దొట్టి యంతటఁ బోక మమ్మును దడుపుటయును
నేను నవ్వుచుఁ దగునే యిట్లు శాంతుఁడ వగు మని పలికిన నాక్షణంబ


తే.

శాంతుఁడై తనుత్వము నొంది చాఱుఫేన, వస్త్రుఁడును నూత్నకంకణోజ్జ్వలతరంగ
భుజుఁడు ముక్తామణిస్తోమభూషితుఁడు,నగుచు రాజన్యు[3]వలెను సొంపార నిలిచె.

39


వ.

అవ్విధం బాలోకించి యేను భావియగు దేవకార్యంబు వీక్షించుటం జేసి యతనితోడ.

40


క.

రాజోచితజృంభణమున, రాజాకృతితోడ సింధురాజ కడఁగి యీ
రాజసము నీవు చేసితి, రాజై యటుగాన యుర్విఁ బ్రభవింపఁ దగున్.

41


వ.

శాంతుండ వగు మని యేను పలికినం దనుత్వంబు నొందితివి గావున శంతనుం డనం
బరగెద వీగంగయు నిప్పు డెట్లట్ల నీకు భార్య యయ్యెడు ననినం దలంకి సము
డ్రుంగు గంగాసమేతంబుగా సాకారుం డై నాకుం బ్రణామంబు సేసి.

42


ఉ.

పర్వపుఁగాలముల్ జలదపఙ్క్తులతోఁ బవనంబు రేఁగి యం
తర్వలనంబు సేఁతయు సుధాకరదర్శనము న్మదూర్ములం
బర్వఁగఁ జేసె నాకు నిది పన్నుగ నైజము గాని యేమియున్
గర్వము గాదు శాప మొసఁగం దగునే జగదీశ దీనికిన్.

43
  1. మనకున్ ఆది
  2. నఖిలభూమిసురక్షత్రియాన్వయముల
  3. కరణి