ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

హరివంశము


వ.

అనిన నట్ల కాక యని యయ్యనుష్ఠానంబు విధంబునడప సుక్తకాలంబునం గన్నియ
పుట్టి గోప్రదానప్రసూత యగుటం జేసి గాందిని యనుపేరు గాంచి క్రమంబునం
బెరిఁగి పెండ్లిప్రాయంబున నున్నదిగావున నన్నాతి నన్నరనాథుండు పరమోప
కారి యైనయాశ్వఫల్కునకు నొసంగె నట్టితండ్రికిం బుట్టిన కొడుకునకు బితృ
ప్రభావం బెట్లును లేకుండునే యక్రూరుం డసాధారణగౌరవోదారుం డట్లు
గావున.

229


క.

ఆతఁడు దొలఁగిన నెంతయు భీతికిఁ బట్టయ్యె నిట్లు పృథివి దగదు నీ
త్యాతిశయగుణునిదెస నొక, టేతావనాత్రమునకు నెగ్గు గణింపన్.

230


వ.

అనినం దద్వచనం బంగీకరించి రథాంగధరుండు తదపరాధంబు సైరించినవాఁడయి
యుగ్రసేనానుమతంబున నక్రూరు రావించిన నుపప్లవం బంతయుం బ్రశాంతం
బయ్యె నంతం గృష్ణుం డొక్కనాఁ డంతర్గతంబున.

231

శ్రీకృష్ణుఁ డక్రూరునిచేత నున్న శ్యమంతకరత్నంబు బయలుపఱుచుట

సీ.

ఘనుఁడు [1]శ్వఫల్గునితనయుఁ డక్రూరుండు తండ్రిప్రభావంబు తాను జూపె
నను డల్పహేతువు నరయ ననల్పంబు గలదు దుర్భిక్షాదికలుషశాంతి
యందుఁ గారణ మొక్కఁ డాశ్యమంతకరత్న మున్నది యాతనియొద్దఁ దప్ప
దిది యమ్మహామణి కీదృశాద్భుతభూతి గలుగుట విందు మీయలఘుశీలుఁ


తే.

డోలి నొకజన్న మొనరించి యొండుక్రతువు, దోనతొడఁగెడు నసదృశదానగరిమ
[2]యెడపడకయుండ సలిపెడు నింతవ్యయము, సేయ నే మెఱుఁగనిసిరి [3]చెందెనెందు.

232


వ.

అని యూహించి సమస్తయదువృష్ణిసమక్షంబున నొండుకార్యంబుపేర నతనిం
బిలిపించి.

233


క.

ఆపనికిఁ దగిన సరసా, లాపంబులఁ గొంతసేపు లాలితమృదుగో
ష్ఠీపరిణతుఁడై పదపడి, యాపురుషోత్తముఁడు నగుచు నబ్బోజవిభున్.

234


వ.

దానపతీ యని సంబోధించి యల్లన యిట్లనియె.

235


చ.

సకలజగంబు[4]లందుఁ గడుసార మనం దగునుజ్జ్వలచ్ఛ్యమం
తకమణి నీకు నిచ్చె శతధన్వుఁడు నీవును డాఁచినాఁడ వి
య్యకుటిలకర్మ ముర్వింగలయంతటికిన్ హిత మేను నాత్మ దీ
నికిఁ గడు సంతసిల్లితిని నిక్, మెఱుంగుదు మింత యెప్పుడున్.

235


క.

నీయొద్దన యుండుటయును, మాయర్థం బగుటఁ జేసి మది నెఱిఁగియు నొం
డేయదియును బలుకము భవ, దీయమహత్వంబు బహుమతిక్షమ మగుటన్.

236
  1. శ్వఫల్కు
  2. యెడవకుండఁగ సలిపెడు
  3. యే యితనికి
  4. నందు