పుట:హరవిలాసము.pdf/110

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము lll

చ. తిమిరమహాస్త్ర మేసి రణతీవ్రత సూపిరి దైత్యపుంగవుల్
క్రమమునఁ గప్పె నల్గడల గాఢమహోద్ధతిఁ జిమ్మచీఁకటుల్
తెమలె దిశావివేకమును ధీరతయు న్వెస నెల్లవారికిం
బ్రమసి సురేంద్రసారథియుఁ బాఱఁగ వైచెఁ బ్రతోద మవ్వలన్. 171

క. రథ్యములు పరవనేరక, మిథ్యాభిమతంబు లయ్యె మెయి మఱచి సమి
ద్రథ్యు ధనంజయుఁ గానక, తథ్యమునకు లేక యుండఁ దత్సారథియున్. 172

వ. భయం బంది యర్జున యెటపోయె దని యెలుంగెత్తి యాహ్వానంబు సేసి తొల్లి దేవాసురసమరంబు లనేకంబులు చూచితిం గాని యిట్టిభయోద్రేకజన్యంబు లగుజన్యంబులు సూడ వీరు వరజనితవీర్యదర్పితులు గావున వీరిసంప్రహారంబు ఘోరంబు అని పల్కిన మాతలి నూఱడించి యించుకసేపు మద్భుజావిహారంబు చూడుమని ఫల్గునుండు. 173

శా. జంభధ్వంసివరంబునం గనినయస్త్రంబు న్మహాసారమున్
శుంభద్విక్రమబాహుదర్పములు సంశోభిల్ల నేసెం దమ
స్సంభారం బడఁగన్ దిశ ల్విపులవైశద్యంబు నొందన్ సుర
ల్సంభావింప భయంపడంగ దితిజు ల్సంగ్రామరంగంబునన్. 174

మ. జవ మేపాఱఁగఁ గూలె దైత్యతనువు ల్సర్వంసహాపీఠిఁ బాం
డవగాండీవధనుఃప్రకాండభవకాండప్రస్ఫుటోచ్చండతాం
డవపాండిత్యవిశేషవిభ్రమకృతాడంబప్రతీకంబులై
యవనీంద్రంబులభంగి నింగి యద్రువన్ హాహానినాదంబులన్. 175

వ. ఇట్టినివాతకవచులు నిరవశేషులై మడసిన సుక్రందననందనుండు తత్పురంబులోనికిం జని యంతయుం గనుంగొని మాతలి కిట్లనియె. 176

తే. కనకమయహట్టకుట్టిమకాంత మగుచు, వివిధమణిసౌధములును వస్తువులు గల్గు
నిప్పురంబునఁ గాఁపుండ కితరమైన , పురమునం దేల నిల్చె నిర్జరవిభుండు. 177

ఉ. నావుడు నిట్లనుం ద్రిదశనాయకుసారథి నిర్జరేశ్వరుం
డీవనరాశిలోన సృజియించెను దైత్యభయంబుచేత దే
వావలి కుంద నిప్పుర ముదగ్రగతిం దనుసూను లంత రా
జీవభవుం బ్రసన్నునిగఁ జేసి మహాబలవీర్యవంతులై. 178

క. ఇందుండఁగ నింద్రాదిక, బృందారకవరులతోడఁ బెనకువ నెందున్
గ్రిందుపడకుండఁ దపమున, నందిరి వర మఖిలభువనహననోత్సుకతన్. 179

వ. కావునం దద్విజయార్థంబుగా విజయ నిన్ను వాసవుండు వనిచె, నిమ్మహాసురులు మరుద్గరుడగంధర్వసిద్ధసాధ్యుల కసాధ్యు లిట్టివారల విశ్రమంబునం జంపి పెంపు గాం