పుట:హరవిలాసము.pdf/107

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108 హరవిలాసము

క. నీ వని సేయ బలాడ్యుఁడ, వీవిశ్వంబునను నీకు నెదు రెవ్వరు లే
రావంత యైన వదలకు, మేవలనను దేవవిప్రహితకార్యంబుల్. 146

క. ఏపున భుజగర్వోన్నతి, ప్రాపున దీపింప నిట సుపర్వహితార్థం
బొపార్థ! చేయవలయును, నాపనిచినపంపుపంపున న్శౌర్యనిధీ. 147

చ. అలఘుబలు ల్నివాతకవచాఖ్యులు వీరులు ఘోరదానవు
ల్జలనిధిగొంది నుండుదు రసాధ్యులు నిర్జరసిద్ధసాధ్యకుం
డలినరకిన్నరద్యుచరనాయకకోటికి మూఁడుకోట్లవా
రలవలనం గలంగెడు నిరంతరబాధల ముజ్జగంబులున్. 148

చ. మఱియును నెందఱేని నసమానబలు ల్సురలోకకంటకు
ల్తఱచుగ బాధ చేసెదరు దైత్యు లవధ్యులు నిర్జరాళి కే
డ్తెఱ నెలయంగ వీరభవదీయశరార్చులపాలు సేసి యం
దఱ నుఱుమాడి యెంతయు హితం బొనరింపుము మాకు నర్జునా. 149

వ. అని సునాసీరుండు సమారాధనంబున. 150

క. తనతొడినభూషణంబులు, తనదుకిరీటము నభేద్యతరకవచంబుం
దనసుతున కొసఁగ గాండివ, ధనువున నగజయము గుణము దాఁచి కడంకన్. 151

క. హయము లనూరుసవర్లము, లయుతంబు వహింప సూతుఁ డై మాతలియు
న్నియమింపఁ దనరునరదము, నయదము నెక్కంగఁ బనిచి హర్షం బెసఁగన్. 152

తే. అసురలోకంబు నిర్జింప ననుపఁ బొంగి
సంగరోత్సాహ మెదలోన సందడింప
నడరుపెంపున నరుగునయ్యర్జునునకు
నిర్జరులు హర్షమున నిట్లనిరి కడంగి. 153

సీ. ఈరథం బెక్కి మున్నింద్రుండు నిర్జించె శుంభన్మహాదైత్యు జంభదైత్యు
నీశతాంగమున బర్హిర్ముఖేంద్రుఁడు ద్రుంచె నాజి నిస్తంద్రు వృత్రాసురేంద్రు
నీయరదంబున నెగిచె గోత్రవిభేది పరిపంథిఘనమహాబలుని బలుని
నీ తేరఁ గాదె మాయించె సుత్రాముండు, పాకదైతేయు నిర్భయసహాయు
తే. నీమహాస్యందనంబున నేపు మాపె
నముచిముఖదానవశ్రేణి నమరవిభుఁడు
నీవు మీతండ్రియట్లన నిఖిలదనుజ
పతుల నోర్వుము దీనిచేఁ బాండవేయ. 154

వ. అని పల్కి దేవసంబంధం బైనదేవద త్తం బనుశంఖం బిచ్చినం బుచ్చుకొని యర్జునుండు మాతలియుం దానును దద్రథాధిరోహణంబు చేసి నివాతకవచవధార్థం బతిరభసంబున నరుగువాఁడు ముందటఁ గరిమకరకరకఠోరఫూత్కారవారిధారాలవాసారపూర్యమాణ