పుట:హంసవింశతి.pdf/84

ఈ పుట ఆమోదించబడ్డది


చ.

సరసులు గద్యపద్యముల చాతురికిన్ దలలూఁచి మెచ్చఁగా
విరసు లసూయచేత మఱి వేడ్కవహింపరు, తేఁటిమొత్తముల్
శరదరవిందబృందఘనసారమరందసుగంధసంగ్రహ
స్ఫురణ వహించుఁగాని, పురసూకరపంక్తులు చెందనేర్చునే!

13


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును సుకవి స్మరణంబును గుకవి తిరస్కర
ణంబును గావించి, తదనంతరంబ.

14


ఆత్మ స్తుతి


సీ.

ఎవనికీరితి కుభృద్ధవ కుభృద్ధర బుధ
కరిసైంధవ సమిద్ధహరిణరుచిర
మెవనిమేధంబు రుడ్భవ కభుగ్ధవ విధూ
ద్భవ మరుద్ధవ గురుప్రతివిఘాతి
యెవని యీ వహిమరుగ్భవ సరిద్ధవ లస
ద్భువనభృత్త్రిపురభిద్భూరిమహిమ
యెవనిరూ పమృతభుగ్ధవసుతోడ్వీడ్రతీ
డుడ్విడ్భృదాప్తపుత్త్రోల్లసనము


గీ.

మంత్రిమాత్రుండె యతఁడు దుర్మంత్రిమంత్ర
తంత్రసంత్రాసకరణస్వత్రంతుఁడయల
రాజవంశసుధావార్థిరాజ సూర
యార్య నారాయణామాత్యవర్యుఁ డలరు.

15


వ.

వెండియు నఖండతేజఃకాండమార్తాండమండలప్రచండుండును, నిజవిత
రణాకర్ణనకృశీభూతపారావారపునరభ్యుదయకారణానూనదానధారా
ప్రవాహసంజాతమహావాహినీవ్యూహుండును, నిస్తులప్రశస్తసమస్త
సద్గుణరత్నరత్నాకరుండును, గౌండిన్యగోత్రపవిత్రుండును గొండమాం
బాగర్భవారాశిచంద్రుండునునగు నయ్యలరాజు నారాయణామాత్యదే
వేంద్రుండు గొండొకశుభవాసరంబున నత్యంతసంతోషితాంతఃకరణుండై.

16