పుట:హంసవింశతి.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

xxxv


కావచ్చును. అరమాట లనఁగా నేమి? శకట రేఫమైనచో అఱ = పేటికాదుల అంతర్భాగము. అపుడు మనసులో దాఁచుకొన్న మాటలగును. ఆ మాటల వెనుక నొక చిలిపితనము, దాని వెనుక నొక లెక్కచేయని పొగరుబోతుతనము నుండును. అవి యెట్టివో బాటసారితో ఘటకారనారి జరిపిన సంభాషణక్రమమునఁ జూపఁబడెను.

సీ. దప్పికిమ్మన మదిదప్పినదా? యను
          చెంబుదెమ్మనిన కుచంబె? యనును
    కూరఁబెట్టుమనఁ జేకూరెనా? హితమను
          నన్న మడిగిన నధ్వాన్న మనును
    సున్న మిమ్మన్నఁ గూసున్న మేలనుఁ, బోక
          వక్క లేవనిన గుర్వక్కె యనును
    నిప్పని పలుకఁగా నిప్పనికని యను
          నాకిమ్మనిన మసియాకె యనును

తే. దేహ మలసె నటన్న సందేహమా య
    టంచు నిట్లేపురేఁగి యమ్మించుబోఁడి
    యతని మాటల కరమాట లాడుకొనుచుఁ
    గేరి నవ్విన... (5-70)

ఈ క్రమముఁ జూచినచోఁ, బాప మామెకుఁ జెవుడేమో యనిపించును. కాని చివరఁ గేరి నవ్వుటచేఁ జెవుడు కాదని, కావలసి యన్యార్థముఁ గల్పించి మాటాడుచున్నదని, అరమాటలు వికటోక్తు లని తేటపడుచున్నది.

చమత్కార పద్య శిల్పము

ఈ చమత్కార మధిక భాగము ఛందస్సంబంధియై భాసించును. ఈకవి యేమి? ప్రబంధ కవులందఱు ఈ శిల్పమున కగ్రతాంబూల మిచ్చిన వారే. కని సమయకౢప్తసామగ్రి చేతఁబట్టుకొని భావప్రపంచమున మేడమీఁద మేడ యెన్ని