పుట:హంసవింశతి.pdf/103

ఈ పుట ఆమోదించబడ్డది

మోరుండ, లంగ రొల్లెలు, మణుఁగుఁ బువ్వులుం, బేణీలు, నీరువత్తిగెలు, మడతలుఁ, బప్పు బూరెలు, సజ్జబూరెలు, వడ, లామవడ, లొబ్బట్లు, సారసత్తులు, సేవలుఁ, జిరిమిళ్ళు, సరడాలుఁ, బరిడ గవ్వలుఁ, జాపట్లు, నిడ్డెనలు, తేనె తొలలు, బొరుగులు, నేలకికాయలు, వెన్న మెఱుంగులు, నిడికుడకలు, సడకుడకలు, ముత్తెఁపుఁజిప్పలుఁ, జంద్రకాంతలుఁ, గరిజకాయలు, బెడదలు, లడ్వాలుఁ, గోడబళ్ళు, గూడు పరిగెలుఁ, దెలుపరిగెలుఁ, బూరీలు, గూళ్పాపిడ, లాదిగాఁ గల భక్ష్యంబులు, గూడలనించి, జాతి సాతానులు గావళ్ళంబూని వెంటనంటిరా, నప్పుడు.105

తే. తనకు నిలవేల్పులౌ తల్లిదండ్రులకును
భక్తితో మ్రొక్కి దన ప్రాణపదము నైన
భార్యతోఁ దెల్పి యక్కునఁ బట్టి చేర్ప
నా వధూటియు నధికదీనాస్య యగుచు. 106

ఉ. ఓ మగరాజ! నీవు చన నొంటిగ నేనిట నుండ నేర్తునే?
నామదిఁ జూడఁగోరి యిటు న న్నలయించెద వంచు బాష్ఫధా
రామిళితాక్షియై ఘనతరంబగు శోకముఁ జెంద విష్ణుదా
సా మధురోక్తి నూఱడిలుమంచు ముదంబునఁ గుస్తరింపఁగన్. 107

సీ. నీ తావి కెమ్మోవి నిలుచుఁబో! కంచివా
ల్గంటుల మొలపంటి గంటి గుఱుతు
నీ వాలుఁగన్నుల నెఱయుఁబో! నెల్లూరి
కొమ్మల కపురంపుఁ దమ్మరసము
నీ చెక్కుల రహించుఁబో! చెన్నపట్నంపు
వారిజేక్షణల క్రొవ్వాఁడి గోరు
నీ యురస్స్థలి మించుఁబో! యఖిలక్షమా
కోమలాంగుల కుచకుంకుమంబు
తే. లింటనె మెలంగు వారల కీసుఖంబు
లెటులఁ జేకూరు? నని పల్కి హితముఁ జిల్కి