ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము
411
యడరి కేడించి పోట్లా డెడివారు
పంకించి బాకుల బాకుల చికిలి
వంకిళ్ల వంకిళ్ల వరుస గ్రొవ్వాడి
చూరీల చూరీల జొచ్చి భేదించి1240
చీరి డొక్కలు చించి చెండాడువారు
బలమును జలము నిబ్బరము నగ్గలము
బొలుపంద నందంద బోరాడువారు
నెలకొని చికిలి పన్నిదమాడునటుల
నెలమి కోలాటంబు లేయు కైవడిని1245
యలరార బిళ్లద్రిప్పాడినకరణి
నలముక చిడుగుడు లాడెడిసరణి
జలధులు జలధులు సరిబోరునటుల
చలమున సమరంబు సల్పు నవ్వేళ
కనకాంబరధరుండు కర్ణునిమోముఁ1250
గనుఁగొని చాల వక్కాణించి పొగడి
అల్లదె గనుఁగొను మయ్య రాధేయ !
మొల్లముగా మినుముట్టి యున్నదియు
విహితప్రదీప్తుల వృషభధ్వజంబు